రెజొనెన్స్‌ శ్రీనగర్‌లో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు

రెజొనెన్స్‌ శ్రీనగర్‌లో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు

-వేడుకను ప్రారంభించిన ఖమ్మం కార్పొరేషన్‌ మేయర్‌ పూనుకొల్లు నీరజ

ఖమ్మం/ అక్షిత బ్యూరో :

ఖమ్మం శ్రీనగర్‌ కాలనీలోని రెజొనెన్స్‌ స్కూల్‌లో పూల పండుగ అయిన బతుకమ్మ వేడుకలను తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా ఆడపిల్లల బతుకమ్మ ఆటపాటలతో కనులవిందుగా ప్రకృతి పరవసించేలా సంబరాలు అంబరాన్నంటేలా అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగినది.రెజొనెన్స్‌ శ్రీనగర్‌లోని బతుకమ్మ వేడుకలకు ఖమ్మం కార్పొరేషన్‌ మేయర్‌ పూనుకొల్లు నీరజ ముఖ్యఅతిధిగా పాల్గొని మాట్లాడుతూ భారతదేశంలో ఎక్కడా జరగని అధ్భుతమైన పూల పండగ బతుకమ్మ పండగ.తెలంగాణ ప్రజలందరూ వారి బతుకులో భాగంగా కుటుంబమంతా ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ వనాలలోని రంగురంగుల పూలను తెచ్చి బతుకమ్మగా పేర్చి పసుపుముద్దతో గౌరమ్మను చేసి భక్తిశ్రద్ధలతో పూజలు చేసి ఆడపడుచులందరూ చప్పట్లుకొడుతూ ఆటపాటలతో ఆనందంగా జరుపుకుంటూ అందరికి బతుకునిమ్మని చేసుకునే పండుగే బతుకమ్మ పండుగ అని తెలియజేస్తూ తెలంగాణ స్వరాష్ట్రంగా ఏర్పడిన తర్వాత బోనాలు బతుకమ్మ పండుగలు అత్యంత ప్రాధాన్యతతో సగర్వంగా నిర్వహించుకుంటున్నాము. నేడు బతుకమ్మ పండుగను జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకునేలా బతుకమ్మ సంబరాలు జరుపుకుంటున్నామంటూ బతుకమ్మ పండుగ అన్నదమ్ముల అక్కచెళ్లెల్ల మధ్య ఆత్మీయ అనుబంధాలను ప్రేమానురాగలను పెంపొందిస్తుందంటూ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తూ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు పండుగల వైభవాలను విద్యార్థులకు తెలియజేస్తున్న రెజొనెన్స్‌ శ్రీనగర్‌ యాజమాన్యానికి అభినందనలు తెలియజేస్తూ ఈ బతుకమ్మ వేడుకలలో పాల్గొనడం ఆనందాన్ని ఇచ్చిందంటూ అందరికి బతుకమ్మ దసరా శుభాకాంక్షలు తెలియజేసారు.ఈ కార్యక్రమంలో డైరెక్టర్‌ కొండా శ్రీధర్‌రావు గారు మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతానికే ప్రత్యేకమైన ఈ పండుగను ప్రాచీన కాలం నుండి సాంప్రదాయకంగా జరుపుకుంటున్నామని తెలంగాణలో అన్ని కుంటుబాలలోని ఆడపడుచులు వారి అన్నదమ్ములు కలకాలం ఆనందంగా జీవించాలని కోరుతూ తంగేడూ బంతి చేమంతి ఇంకా వివిధ రకాల పూలను బతుకమ్మగా పేర్చి గౌరమ్మను ప్రతిష్టించి 9 రోజుల పాటు జరుపుకునే పండుగ అని తెలియజేస్తూ చెడుపై మంచి సాధించిన విజయానికి సూచికగా విజయదశమిని జరుపుకుంటున్నామంటూ రెజొనెన్స్‌ శ్రీనగర్‌ మన సంస్కృతి సంప్రదాయాలు పాటిస్తూనే నూతన ఆవిష్కరణలకు విద్యార్థులలో నైపుణ్యాలను పెంపొందించుటకు చక్కటి ప్రణాళికలను సిద్దంచేసి ఆచరిస్తుందంటూ బతుకమ్మలతో వచ్చి అలరించిన విద్యార్థినులను ఉపాధ్యాయినిలను మరియు తల్లిదండ్రులను అభినందిస్తూ అందరికి బతుకమ్మ దసరా శుభాకాంక్షలు తెలియజేసారు.ఈ కార్యక్రమంలో స్కూల్‌ డైరక్టర్‌ కొండా కృష్ణవేణి పాల్గొని మాట్లాడుతూ ఆడపిల్లలందరూ ప్రకృతిలోని తీరొక్కపూలను తెచ్చి మహాలయ అమావాస్య మొదలుకొని 9 రోజులు సద్దుల బతుకమ్మతో తెలంగాణ పూల పండుగ జరుపుకుంటూ రకరకాల పిండి వంటలను ప్రసాదాలుగా చేస్తూ తెలంగాణ సంస్కృతిని గొప్పతనాన్ని తెలియజేస్తూ కుటుంబమంతా కలకాలం సుఖసంతోషాలతో ఉండాలని గౌరమ్మను పూజిస్తూ జరుపుకునే పూలపండుగ ప్రకృతిపండుగ ఆడపడుచుల కేరింతల పండుగ బతుకమ్మ పండుగని తెలియజేస్తూ అందరికి బతుకమ్మ, దసరా శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ యం.ప్రసన్నరావు ఉపాధ్యాయులు మరియు ఉపాధ్యాయేతర సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking