బాల కార్మిక నిర్మూలనకు అన్ని శాఖలు కలిసి పని చేయాలి డీసీఎల్ ను కలిసిన బాల కార్మిక సంస్థ పీడి

బాల కార్మిక నిర్మూలనకు అన్ని శాఖలు కలిసి పని చేయాలి డీసీఎల్ ను కలిసిన బాల కార్మిక సంస్థ పీడి

వరంగల్,అక్షిత బ్యూరో :

హనుమకొండ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన
రమేష్ బాబు ను జాతీయ బాల కార్మిక నిర్మూలన సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ బుర్ర అశోక్ కుమార్, జిల్లా బార్ అసోసియేషన్ మాజీ ఉపాధ్యక్షులు డాక్టర్ తాటికొండ కృష్ణ మూర్తి లు
శుక్రవారం రోజున జిల్లా కార్మిక శాఖ కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలుసుకొని పుష్పగుచ్చం అందచేసి శుభాకాంక్షలు తెలిపారు,
అనంతరం బాల కార్మిక నిర్మూలన సంస్థ కార్మిక శాఖ, పోలీస్, మరియు జిల్లా బాలల పరిరక్షణ విభాగం, చైల్డ్ హెల్ప్ లైన్ సమన్వయంతో నిర్వహిస్తున్న పునరావాస కార్యక్రమాలను, అవగాహన సదస్సుల గురించి వివరించారు.
ఈ సందర్భంగా డీసీఎల్ రమేష్ బాబు మాట్లాడుతూ అన్ని శాఖల సమన్వయంతో బాలల అభివృద్ధికి సహకరించి బాల కార్మికులు, బందిత కార్మికుల నిర్మూలన కోసం కార్యాచరణ ప్రణాళికతో ముందుకెళ్దామని అన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking