కలెక్టర్ కార్యాలయ సూపరింటెండెంట్ మృతి
వరంగల్,అక్షిత బ్యూరో :
దేశాయిపెట్ కు చెందిన ములుగు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సూపరింటెండెంట్ గా విధులు నిర్వహిస్తున్న జన్ను సంజీవ కిడ్నీ సమస్యతో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందారు. గత కొన్ని రోజులుగా కిడ్నీ సమస్యతో బాధపడుతూ. ఆయన హైదరాబాద్ లోని కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా పరిస్థితి విషమం కావడంతో నిన్న తుదిశ్వాస విడిచారు. ఘతం లో హనుమకొండ,కురవి, ఏటురునాగారం లలో పనిచేసి ప్రస్తుతం ములుగు జిల్లా కలెక్టర్ కార్యాలయం లో సూపరింటెండెంట్ గా విధులు నిర్వహిస్తున్నారు.పలువురు రెవెన్యూ ఉద్యోగ సంఘాలు వారి మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.సౌమ్యుడిగా వివాదాలు లేని వ్యక్తిగా పేరు గాంచిన సంజీవ ఇలా హఠాత్తుగా మృత్యువు కు గురి కావడం అందరినీ కలిచి వేసింది. స్థానిక జర్నలిస్టులు విచారం వ్యక్తచేశారు డా,పాలదుగుల సురేందర్, జన్ను కొర్నెలు, జన్ను స్వామి ,డా,కంకల మల్లేశం,మార్గం కుమార స్వామి,జీవన్,ఉద్యోగుల సంఘం నుండి కా సత్యనారాయణ,శ్రీనివాస్, తహిషిల్డారులు గుండాల నాగరాజు,ఇక్బాల్ అహ్మద్ శ్రీ పాల్ రెడీ తదితరులు పార్ధీవ దేహానికి నివాళులు అర్పించారు.