తక్కువ సమయంలో ఖమ్మం ను అన్ని కోణాల్లో అభివృద్ది చేశా

తక్కువ సమయంలో ఖమ్మం ను అన్ని కోణాల్లో అభివృద్ది చేశా

-మంత్రి పువ్వాడ అజయ్

ఖమ్మం/ అక్షిత బ్యూరో :

ఖమ్మం నగరం 12వ డివిజన్ నందు పులిపాటి ప్రసాద్ అధ్వర్యంలో వారి నివాసంలో ఎర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో బిఆర్ యస్ పార్టీ ఖమ్మం నియోజకవర్గ అభ్యర్థి పువ్వాడ అజయ్ కుమార్ పాల్గొని మాట్లాడారు.అతి తక్కువ సమయంలో ఖమ్మం ను అన్ని కోణాల్లో అభివృద్ది చేసినం.గడచిన నాలుగేళ్లలో ఖమ్మం స్వరూపం పూర్తిగా మారిపోయింది. ఇక్కడి నుండి ఉన్నత చదువుల కోసం ఇతర ప్రదేశాలకు వెళ్లి తిరిగి ఖమ్మం వచ్చిన వారు ఆశ్చర్యాన్ని వ్యక్త పరచటం చూసా.అనేక మంది నాకు స్వయంగా ఫోన్ ద్వారా చెప్పిన వారు అనేక మంది ఉన్నారు.అప్పుడు నేను చాలా సంతోషపడ్డా.ఇదంత ఒక్క రోజులో సాధ్యం కాలేదు. ప్రణాళికా బద్దంగా చేయడం ద్వారానే సాధ్యమైంది.ఏదైన ఒక్కరోజులో సాధ్యపడదు. మంత్రి కేటిఆర్ కి నా ఆలోచనలు చెప్పినపుడు నువు ముందుకు వెళ్ళు నిధుల సంగతి నేను చూసుకుంటా అని హామీ ఇవ్వడం పట్ల వారికి ధన్యవాదాలు.ఖమ్మం జిల్లా కేంద్ర బస్ స్టాండ్ గతంలో ఒక కాంట్రాక్టర్ కి ఇస్తే తీవ్ర జాప్యం చేశారు.నేనే స్వయంగా కల్పించుకుని మరొకరికి ఇచ్చి ఆయా నిర్మాణ కేవలం 9 నెలల్లో పూర్తి చేసి ప్రారంభోత్సవం చేసినం. అభివృద్ది పట్ల నాకు అంతటి చిత్తశుద్ది ఉంది.ఒకప్పుడు గోళ్ళపాడు ఖమ్మం త్రీ టౌన్ కు శాపంగా ఉండేది.ఇన్ని ప్రభుత్వాలు వచ్చాయి. ఎవరైనా దాని అభివృద్ధికి కనీసం ఆలోచన చేశారా..?కానీ ఎమ్మెల్యేగా గెలిచిన తొలి సంవత్సరమే నా పుట్టినరోజు సందర్భంగా గోళ్ళపాడు ఛానల్ ను స్వయంగా అభివృద్ది పనులు ప్రారంభించా.ఈ విషయం మీ అందరికీ తెలుసు.ప్రారంభించిన నాడు నేను కేవలం ఎమ్మేల్యే ను. అయినా మంత్రి కేటిఆర్ పై భారం వేసి ముందుకు సాగిన. ఆనాటి కాలంలోనే దాన్ని అత్యంత అద్భుతంగా అభివృద్ది చేసి ప్రజలకు కావాల్సిన అన్ని సదుపాయాలతో తీర్చిదిద్దిన. ఒకప్పుడు చీ అని చిదరించుకున్న గోళ్లపాడు నేడు ఇదే గోళ్లపాడు ఖమ్మం త్రీ టౌన్ కు ఆహ్లాదానికి, క్రీడలకు చిన్న పిల్లలకు ఆటలకు పెద్దల ఆరోగ్యానికి నిలయంగా మారింది.ఒకప్పుడు ఇక్కడ నివాసం ఉండటానికి ఇబ్బంది పడ్డ ప్రజలు నేడు ఇక్కడ స్థలం కొనుక్కుని నివాసం ఉండటానికి ఆసక్తి చూపుతున్నారు.అపార్ట్మెంట్ లు కట్టి అమ్ముతున్నారు. నగరంలో రోడ్ల విస్తరణ అంత సులువైన పనా..? ఎప్పుడైనా ఎవరైనా రోడ్డు విస్తరణ చేస్తాం అంటే అక్కడ ప్రజలు ఆక్షేపించేవారు.అడ్డు పడేవారు.కానీ అక్కడ ప్రజల ఆమోదంతో ఎవరికి ఇబ్బంది కలుగకుండా నగరంలోని ప్రతి ప్రధాన రోడ్డు విస్తరించి సెంట్రల్ లైటింగ్ సెంట్రల్ డివైడర్ ఎర్పాటు చేశాం.నేడు ట్రాఫిక్ కు ఎలాంటి ఇబ్బందీ లేదు.ప్రజా రవాణా చాలా సులభతరంగా మారింది.ఒకప్పుడు ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి ఎలా ఉండేది.అదొక ఆసుపత్రి ఉంది అని కూడా ప్రజలు గుర్తించలేదు.కనీసం ఆ వైపు కూడా చూడలేదు.కానీ నేడు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి స్థాయికి తీసుకొచ్చినం. కరోనా సమయంలో మమత ఆసుపత్రి ప్రభుత్వ ఆసుపత్రి కొన్ని వేల మందికి వైద్య చికిత్సలు అందించి ప్రాణాలు కాపాడింది.ఆ రోజు మీరు ఎక్కడికి పోయారు.. నేడు ప్రజల పై దొంగ ప్రేమలు కురిపిస్తున్న వారు ఆ నాడు ఎక్కడికి పోయారు. రాజకీయాల్లో ఉన్న వారే కదా ప్రజల పట్ల కనీస బాధ్యత ఉండొద్దా. కనీసం కాకరకాయ అన్న పంచినవా.విజ్ఞులైన ప్రజలు ఆలోచన చేయాలి. ప్రజల కోసం పని చేసిన వారు ఎవరు.. చేసే వారు ఎవరో ఆలోచన చేయాలి.వచ్చే ఎన్నికల్లో బీఆర్ యస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతున్న.ఇలా ఖమ్మం నగరం అనేక మున్సిపాలిటీ లకు ఆదర్శం.ఈ కార్యక్రమంలో విత్తనాభి వృద్ది సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు మేయర్ పునుకొల్లు నీరజ డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహార డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం భద్రాద్రి బ్యాంక్ చైర్మన్ చెరుకూరి కృష్ణమూర్తి వర్తక సంఘం చైర్మన్ చిన్ని కృష్ణా రావు గరికపాటి వేంకటేశ్వర రావు వల్లభనేని రామారావు కార్పొరేటర్ ప్రశాంతి లక్ష్మీ పసుమర్తి రాం మోహన్ సందీప్ పసుమర్తి లక్ష్మణ రావు కొత్తా వేంకటేశ్వర రావు అమరబొయిన వెంకటేశ్వర్లు మాటురి లక్ష్మీనారాయణ తదితురులు పాల్గోన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking