డాక్టర్ తాళ్ల రవికి సన్మానం
వరంగల్,అక్షిత బ్యూరో:
వరంగల్ నగరంలోని గోపా వరంగల్ జిల్లా ముఖ్య సలహాదారులు డా. తాళ్ళ రవి కి సన్మాన కార్యక్రమం ఉమ్మడి వరంగల్ జిల్లా రేడియాలజీ అసోసియేషన్ అధ్యక్షుడు గా ఎన్నికైన సందర్భంగా డా, రవి ని గోపా వరంగల్ జిల్లా కార్యవర్గము ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి గోపా వరంగల్ జిల్లా అధ్యక్షుడు డా. బైరి లక్ష్మీనారాయణ గౌడ్ అధ్యక్షతన వహించారు. ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ పేదల సంక్షేమం కోసం కృషి చేసిన సంగతి విదితమే అన్నారు, ఇంకా ఎంతో మంది ప్రజలకు అందుబాటులో ఉండి వారి అమ్మ డా. చంద్రభాయి ఆశయాల సాధనకు ఇతోధికంగా శ్రమించి ప్రజల ఆశాజ్యోతి గా ఉండాలని కోరుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో గౌడకులస్తులు, డా బొమ్మేర కుమారస్వామి, తాళ్ళపల్లి ప్రకాష్ మండ శ్యామ్ గొడిషల సూరజ్, పొశాల సురేష్ పోశాల మల్లికార్జున్ సురేందర్ కన్న సాంబయ్య ఉమ్మగని గణేష్, రమేష్ బత్తిని భద్రయ్య లింగమూర్తి తదితరులు పాల్గొన్నారు