పదవులు లేకున్నా ప్రజా సేవ చేస్తున్న
మాజీ ఎమ్మెల్సీ నాగపురి
చేర్యాల, అక్షిత ప్రతినిధి :
జనగామ నియోజకవర్గ ప్రాంతానికి గత 10 సంవత్సరాల నుండి బిఆర్ఎస్ పార్టీలో ఉంటూ పదవులు లేకున్నా ప్రజలకు సేవ చేస్తున్నానని మాజీ ఎమ్మెల్సీ నాగపురి రాజలింగం అన్నారు.ఈ సందర్భంగా ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ గతంలో చేర్యాల తాలూకాగా ఉన్నప్పుడు చేర్యాల సమితి ప్రెసిడెంట్గా ఉన్నానని, ఒకసారి ఎమ్మెల్యేగా,రెండుసార్లు ఎమ్మెల్సీగా గెలుపొంది చేర్యాల ప్రాంత అభివృద్ధికి కృషి చేశానని, ప్రజల సౌకర్యం కోసం ప్రతి గ్రామంలో ఆకునూరు లింగాపురం తాడూరు వేచరేణి మరియు కాశ గుడిసెలు తదితర గ్రామాలకు వాగులపై చెక్ డ్యామ్ లో నిర్మించి చిన్న చిన్న బీట్ రోడ్లను వేయించానని, ఇప్పటికీ ప్రతి గ్రామంలో నన్ను గుర్తించిన వారు ఉన్నారని అన్నారు. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీగా ఉండి ప్రత్యేక తెలంగాణ ఉద్యమ కార్యక్రమాల్లో పాల్గొని తన వంతు సహకారం అందించినానని తెలిపారు. సీఎం కేసీఆర్ పిలుపు మేరకు బిఆర్ఎస్ పార్టీలో చేరినప్పటి నుండి ఇప్పటివరకు ఎలాంటి పదవి ఇవ్వ కున్న కూడా పార్టీకి కట్టుబడి ప్రజల కోసం పనిచేస్తున్నానని అన్నారు. తన కుమారుడు నాగపురి కిరణ్ కుమార్ గౌడ్ జనగామ నియోజకవర్గానికి చెందిన ప్రజలకు సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తూ ప్రజాసేవలో ఉన్నాడని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ జనగామ ప్రాంతానికి సేవ చేయడానికి స్థానికులకు అవకాశం కల్పించకుండా? స్థానికేతరులకు గుర్తింపు ఇస్తున్నారని విమర్శించారు. అయినా నేను నా కుమారుడు పార్టీకి కట్టుబడి ఉన్నామని ఇప్పటికైనా కేసీఆర్ మమ్మల్ని గుర్తించి,ఈ ప్రాంత ప్రజలకు మరింత సేవలు అందించేందుకు తమకు అవకాశం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మద్దూరు మండలంలోని రేబర్తి గ్రామానికి చెందిన పిఎసిఎస్ మాజీ చైర్మన్ గాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.