*ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి బిఫాం అందుకున్న పిల్లి రామరాజు యాదవ్*
నల్గొండ, అక్షిత ప్రతినిధి :
ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తెలంగాణ స్టేట్ జనరల్ సెక్రెటరీ బండా సురేందర్ రెడ్డి నుండి నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా పిల్లి రామరాజు యాదవ్ హైదరాబాద్ పార్టీ కార్యాలయంలో బీఫామ్ అందుకున్నారు. ఇదే సందర్భంలో మేడ్చల్ నియోజకవర్గానికి తీన్మార్ మల్లన్న బిఫాం అందుకున్నారు.

ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్.వి ప్రసాద్, రాష్ట్ర కార్యదర్శి కోమటిరెడ్డి తేజ్ దీప్ రెడ్డి, చిత్రంలో తీన్మార్ మల్లన్న, నల్లగొండ జిల్లా జనరల్ సెక్రెటరీ పరంగి రాము,రాష్ట్ర ముఖ్య నాయకులు ఉన్నారు.