జన నీరాజనం
కేసీఆర్ తోనే తండాల,
పల్లెల ప్రగతి
భాస్కర్ రావు
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
గ్రామీణ సమగ్ర అభివృద్ధితోపాటు గిరిజన తండాలను గ్రామ పంచాయితిలుగా తీర్చిదిద్దిన ఘనత కేసిఆర్ ప్రభుత్వానికే చెందుతుందని మిర్యాలగూడ బిఆర్.ఎస్ ఎమ్మెల్యే అభ్యర్ధి నల్లమోతు భాస్కర్ రావు అన్నారు. బుధవారం ఎన్నికల ప్రచారం లో భాగంగా ప్రగతి యాత్రను దామరచర్ల మండలంలోని కేశవాపురం, రామోజీ తండా, లావూరి భిక్య తండా, నునావాత్ తండా తదితర గ్రామాలల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ప్రగతి యాత్రను ఉద్దేశించి భాస్కర్ రావు మాట్లాడుతూ నియోజకవర్గంలోనే గిరిజన లంబాడా తండాలు అత్యధికంగా దామరచర్ల మండలంలో ఉన్నాయని, తండాలను గ్రామా పంచాయితీ లుగా అప్ గ్రేడ్ చేసి అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందన్నారు. గిరిజన తండాల సర్వతోముఖాభివృద్ది కోసం సి.యం. కే.సి.ఆర్ ప్రభుత్వం ప్రణాళిక బద్ధంగా కృషి చేయడం జరిగిందన్నారు. గత పదేళ్లుగా ఈ ప్రాంత అభివృద్దిలో తాను భాగస్వామిగా అయినందుకు సంతోషంగా ఉన్నదన్నారు. త్వరలో జరగనున్న సాధారణ ఎన్నికలలో కారు గుర్తుకు ఓటు వేసి తనకు హ్యాట్రిక్ విజయాన్ని అందించాలని ప్రజలను కోరారు.

ఈ కార్యక్రమంలో డీ.సీ.ఎం.ఎస్ వైస్ చైర్మన్ దుర్గంపూడి నారాయణరెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటి చైర్మన్ బైరం బుచ్చయ్య, ఎం.పి.పి నందిని రవితేజ, జెడ్పీటీసీ ఆంగోతు లలిత హాతీరాం, వ్యవసాయ మార్కెట్ కమిటి వైస్ చైర్మన్ కుందూరు వీరకోటిరెడ్డి, బి.ఆర్.ఎస్ మండల ప్రధాన కార్యదర్శి దారగాని వెంకటేశ్వర్లు, వివిధ గ్రామాల సర్పంచ్లు గుగులోతు సైదా నాయక్, మాలోతు ధస్లీ, శ్రీను నాయక్, ఎంపిటిసిలు, నాయకులు సీతారాములు, లింగా నాయక్, మాలోతు శ్రీను, సాయన్న, ఆడోతు శోభన్ బాబు, మనోహర్, హాగేష్ , మాజీ సర్పంచులు , ఉపసర్పంచులు, గ్రామశాఖ అధ్యక్షులు, ప్రజలు పాల్గొన్నారు.