దళితులు పారిశ్రామిక వేత్తలుగా వెలుగొందాలి
ఉన్నత విద్యా మండలి చైర్మన్ లింబాద్రి
ఆర్మూర్, అక్షిత ప్రతినిధి : దళితులు పారిశ్రామిక వేత్తలుగా వెలుగొందాలని ఉన్నత విద్యా మండలి చైర్మన్ లింబాద్రి ఆకాంక్షించారు. మంగళవారం .
ఆర్మూర్ లోని భువి ఇండస్ట్రీస్ అల్కలైన్ వాటర్ మానుఫాక్చర్ ప్లాంటును సందర్శించారు.
రానున్న కాలంలో ఆల్కలైన్ వాటర్ మంచి ఆరోగ్యం కొరకు చాలా అవసరం ఉంటుందన్నారు. ఇంతపెద్ద ప్లాంటును ఆర్మూర్ లో ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందని, తనవంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తానని అన్నారు.

ఈ సందర్భంగా ఛైర్మెన్, ప్రొఫెసర్ రిక్క లింబాద్రిని డైరెక్టర్ మైలారం బాలు ఘనంగా సన్మానించారు.