గడప గడపకు కాంగ్రెస్ పేరుతో ప్రజల్లోకి

ఎన్నికల కదన రంగంలో దూసుకుపోతున్న పొంగులేటి ప్రసాద్ రెడ్డి, పొంగులేటి హర్ష రెడ్డి

-గడప గడపకు కాంగ్రెస్ పేరుతో ప్రజల్లోకి

-కాంగ్రెస్ తోనే సంక్షేమం సాధ్యం

ఖమ్మం/అక్షిత బ్యూరో :

అన్నకి తగ్గ తమ్ముడిగా ఒక వైపు పొంగులేటి ప్రసాద్ రెడ్డి. తండ్రికి తగ్గ తనయుడిగా మరో వైపు పొంగులేటి హర్ష రెడ్డి సార్వత్రిక ఎన్నికల కదన రంగంలోకి దూసుకుపోతున్నారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తమ్ముడు ప్రసాద్ రెడ్డి తనయుడు హర్ష రెడ్డి గడప గడపకు కాంగ్రెస్ పేరిట పాలేరు నియోజక వర్గంలోని ప్రతీ గ్రామాన్ని సందర్శించి ప్రజల్లో నూతనోత్తేజాన్ని నింపుతున్నారు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలను ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగుతున్నారు. పదిహేను రోజులుగా నిర్వహిస్తున్న ప్రసాద్ రెడ్డి ప్రచారానికి హర్ష రెడ్డి ప్రచారం తోడు అవ్వడంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో మరింత జోష్ పెరిగింది.కాంగ్రెస్ తోనే సంక్షేమం సాధ్యం శీనన్నతోనే పాలేరుకు అభివృద్ధని ప్రజల్లో బలంగా వారు తీసుకు వెళ్తున్నారు.హస్తానికి ఓటు వేయాలని ప్రజలను కోరుతూ వారి నుంచి స్పష్టమైన హామీని తీసుకుని ఓటింగ్ జరగక ముందే బీఆర్ఎస్ ఓటమిని డిసైడ్ చేస్తున్నారు. గడప గడపకు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమానికి వస్తున్న ఆదరణను చూస్తున్న ప్రత్యర్థుల గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ తో తొమ్మిదేళ్లుగా సాధ్యంకాని అభివృద్ది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే చేసి చూపిస్తుందనే భరోసాను ప్రజల్లో నింపుతున్నారు.

ఈ నేపథ్యంలోనే ఖమ్మం రూరల్ మండలంలోని పొన్నేకల్ గ్రామంలో పొంగులేటి ప్రసాద్ రెడ్డి తీర్థాల గ్రామంలో పొంగులేటి హర్ష రెడ్డి గురువారం నిర్వహించిన గడప గడపకు కాంగ్రెస్ ప్రచారానికి విశేష స్పందన లభించింది. ప్రతీ గడపకు తిరుగుతూ హస్తం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. భారీ మెజారిటీతో పొంగులేటి శ్రీనివాసరెడ్డిని గెలిపించాలని కోరారు. బీఆర్ఎస్ కు రోజులు దగ్గర పడ్డాయి అని డిసెంబర్ 9న కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ప్రజల ఆశీస్సులు.దీవెనలతో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ బాధ్యులు స్థానిక ప్రజాప్రతినిధులు ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking