ఆశీర్వదించండి..
అభివృద్ధి చేస్తా..
ముషంపల్లి లో గడపగడపకు ప్రచారం
ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి
పిల్లి రామరాజు యాదవ్
అక్షిత న్యూస్, నల్గొండ/మాడుగులపల్లి:
ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి పెళ్లి రామరాజు యాదవ్ తన ప్రచారంలో గురువారం భాగంగా ముషం పల్లిలో గడపగడపకు ఆచార్య కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ప్రతి ఒక్కరిని కలుస్తూ సింహం గుర్తుపై ఓటు వేసి ఆశీర్వదించమని ఓటు అభ్యర్థించాడు.
ఈ సందర్భంగా పిల్లి రామరాజు యాదవ్ మాట్లాడుతూ నల్లగొండ నియోజక వర్గాన్ని గత 30 ఏళ్లుగా అభివృద్ధి పేరుతో వందల కోట్ల కాంట్రాక్టులలో కమిషన్లు నొక్కి నియోజకవర్గ రాజకీయాలను కలుషితం చేయడానికి మరలా డబ్బుల సంచులతో వస్తున్నారని అలాంటి వారి పట్ల ప్రజల అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.

రాజకీయాలంటే ప్రజాసేవగా కాకుండా డబ్బులతో నాయకులను,ఓటర్లను ప్రలోభ పెట్టడమే ధ్యేయంగా కొనసాగుతున్నారని ఇలాంటి వారి రాజకీయ వికృత చేష్ఠలను ప్రజలు గమనించాల్సిన అవసరం ఉందన్నారు.

నన్ను ఆశీర్వదిస్తే నియోజకవర్గంలో నిఖార్సయిన అభివృద్ధి ఏమిటో చూపిస్తానని వారన్నారు.ప్రజలలో రాజకీయ చైతన్యం రావాలసిన అవసరం ఉందన్నారు.బహుజన బిడ్డగా నన్ను ఆదరించి అసెంబ్లీకి పంపించాలని ప్రజలందరికీ విజ్ఞప్తి చేశాడు.