బిజేపిని వీడి గులాబీ గూటికి

కంచర్ల ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీలో చేరిక
అక్షిత న్యూస్, నల్గొండ /మాడుగులపల్లి :

కంచర్ల భూపాల్ రెడ్డి సమక్షంలో 35 వార్డు చెందిన గుర్రం ధనలక్ష్మి వెంకన్న బీజేపీ . 29వ వార్డు చెందిన కొమ్ము నాగలక్ష్మి ఏఐఎంఐఎం బిఆర్ ఎస్ పార్టీలో చేరారు. వీరితోపాటు కొమ్ము శంకర్, ముఖ్య కార్యకర్తలు బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కంచర్ల వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాధరపూర్వకంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా కంచర్ల భూపాల్ రెడ్డి మాట్లాడుతూ తమ వార్డు అభివృద్ధి కోసం అధికార పార్టీలో చేరితే తమ వార్డు అభివృద్ధి చెందుతుంది అనే ఉద్దేశంతో బిఆర్ఎస్ పార్టీలో చేరినందుకు అభినందిస్తున్నామని..
అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన 10,12 మంది కౌన్సిలర్లు తమతో టచ్ లో ఉన్నారని కాంగ్రెస్ హయాంలో తమ వార్డులను అభివృద్ధి పరచుకోలేకపోయామని తమకు తెలియజేస్తున్నారని త్వరలో వారు కూడా ఒక్కొక్కరుగాతమ పార్టీలోకి వచ్చే అవకాశం ఉందన్నారు.కానీ కొంతమంది బిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు తమ వార్డులను పట్టణ అభివృద్ధిని వదిలి వారి సొంత అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీలో చేరారని ప్రజలు వారిని ప్రజలు గమనిస్తున్నారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, సీనియర్ నాయకులు రాపోలు దత్త,గణేష్,ఫ్లోర్ లీడర్ అభిమన్యు శ్రీనివాస్, పట్టణ పార్టీ అధ్యక్షులు భువనగిరి దేవేందర్, కార్యదర్శి సంధినేని జనార్దన్ రావు, తలారి యాదగిరి,రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking