గ్రామ గ్రామాన గులాబీ జోరు -ప్రతి ఇంట్లో రేగా కాంతారావు పేరే -ముమ్మరంగా ఇంటింటికి ప్రచారం
పినపాక, అక్షిత ప్రతినిధి :
గ్రామ గ్రామాన గులాబీ జోరు ఉందని,ప్రచారంలో భాగంగా ప్రతి ఇంట్లో ఎవరిని అడిగిన రేగా కాంతారావు పేరే ఇనిపిస్తుందని బీఆర్ఎస్ మండల అధ్యక్షులు రావుల సోమయ్య అన్నారు.
శుక్రవారం కరకగూడెం మండలంలోని 28వ బూత్ ఇంచార్జీ గుడ్ల రంజిత్ ఆధ్వర్యంలో కొత్తగూడెం గ్రామంలో ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే,పినపాక బీఆర్ఎస్ పార్టీ అభ్యర్ధి రేగా కాంతారావు కారు గుర్తుకి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.కేసిఆర్ నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు,అభివృద్ధి కార్యక్రమాలు,కేసిఆర్ ప్రకటించిన మ్యానిఫెస్టోలను వివరించారు.
ఈ కార్యక్రమంలో సర్పంచు గొగ్గల నాగమణి,ఉప సర్పంచు ఈసం సమ్మయ్య,ఈసం రామకృష్ణ, రామలింగం,యలిపెద్ది శ్రీనివాసరెడ్డి,రావుల శ్రీను,రేగా సత్యనారాయణ,పాయం నర్సింహారావు,సుతారి నాగేష్,చిట్టి సతీష్,కటకం లెనిన్,కొమరం నాగేష్,తోలెం ప్రవీణ్,ఈసం సత్యం జోగ దూలయ్య తదితరులు పాల్గొన్నారు.