ధర్మ సమాజ పార్టీ కూకట్ పల్లి అభ్యర్థిగా సండ్ర సునీల్ కుమార్…
కూకట్ పల్లి, అక్షిత ప్రతినిధి:
నవంబర్ 30వ తేదీన జరగనున్న తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ధర్మ సమాజ పార్టీ తరఫున కూకట్ పల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా సండ్ర సునీల్ కుమార్ పోటీలో ఉండాలన్నారు ధర్మ సమాజ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ విశారదన్ మహారాజ్. ధర్మ సమాజ్ పార్టీ నాయకత్వం తనకు కూకట్ పల్లి అభ్యర్థిగా ప్రకటించడంతో ఆయన బాలానగర్ లో శుక్రవారం మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సునీల్ కుమార్ మాట్లాడుతూ గడపగడపకు తామ ప్రచారం నిర్వహించి ప్రజలలో చైతన్యం తీసుకొని రావడమే కాకుండా 90 శాతం ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రజల సమస్యల మీద పోరాటం చేస్తామని హామీ ఇచ్చారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని మరియు చేసిన సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకొని వెళ్లి ప్రస్తుత రాజకీయ పార్టీలు ప్రజలను ఏ విధంగా మోసం చేస్తున్నారు ప్రజలకు నిరూపించి వారి విధానాలను ఎండగట్టే దిశగా ముందుకు వెళ్తామని తెలిపారు. ఈసారి కూకట్ పల్లి నియోజకవర్గ అభ్యర్థిగా తనను గెలిపించాలని ప్రజలను కోరారు.