కాంగ్రెస్ బిఆర్ఎస్ ల మాయ మాటలు నమ్మవద్దు

కాంగ్రెస్ బిఆర్ఎస్ ల మాయ మాటలు నమ్మవద్దు : బిజెపి అభ్యర్థి లేగా రామ్మోహన్ రెడ్డి

అక్షిత న్యూస్ రాయపర్తి:

భారతీయ జనతా పార్టీ పాలకుర్తి నియోజకవర్గం అభ్యర్థిగా పార్టీ టికెట్ కేటాయించిన తర్వాత తొలిసారిగా రాయపర్తి మండల కేంద్రానికి తొలిసారి విచ్చేసిన పాలకుర్తి నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి లేగ రామ్మోహన్ రెడ్డి రాయపర్తి మండల కేంద్రంలో నిర్వహించిన ఇంటింటికి బిజెపి కార్యక్రమానికి ప్రజల నుండి విశేష స్పందన లభించింది. బిజెపికి ఓటు వేసి ఇంటింటికి అభివృద్ధి ఫలాలను తీసుకొని వెళ్లే విధంగా చేయాలని ప్రజలను లేగా రామ్మోహన్ రెడ్డి కోరారు అనంతరం మాట్లాడుతూ కాంగ్రెస్ బిఆర్ఎస్ పార్టీలు ఇచ్చే హామీలకు వారు చెప్పే మాయమాటలకు మోసపోవద్దని ఇన్నాళ్లు వారు చేసిన అభివృద్ధి శూన్యం అని దళిత బంధు దళితులకు మూడు ఎకరాల భూమి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ప్రజలకు ఇంకా అందలేదని గుర్తు చేశారు ఈసారి కమలం పువ్వు గుర్తుపై ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు గడ్డం నరేందర్ దుబ్బ రాజశేఖర్ కృష్ణారెడ్డి బిష్మ రెడ్డి నూనె అనిల్ శ్రవణ్ ప్రశాంత్ సుమన్ నిమ్మలని రసాల రాకేష్ మరియు బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking