సీ-విజిల్ యాప్ ను ఉపయోగించుకోండి

 సీ-విజిల్ యాప్ ను ఉపయోగించుకోండి.
ఎస్సై మోహన్ రెడ్డి…

నంగునూర్, అక్షిత ప్రతినిధి:

ఎన్నికల పోటీచేసే అభ్యర్థులు కానీ, అభ్యర్థులకు సంబంధించిన వ్యక్తులు కానీ ఓటు వెయ్యమని ప్రజలను ఇబ్బందులకు గురిచేసిన, డబ్బులు ఆశ చూపి ప్రలోభ పెట్టినా, మద్యం డబ్బులు ఓటర్లకు సరఫరా చేసిన, ఎలాంటి నేరపూరిత చర్యలకు దిగిన, ఎన్నికల సంఘం నియమావళికి విరుద్ధంగా వ్యవహరించిన మరియు అల్లర్లు, గొడవలకు పాల్పడిన వెంటనే గ్రామాల ప్రజలు యువకులు స్పందించి సి- విజిల్ యాప్ ను మొబైల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకుని ఫిర్యాదుదారులు సంబంధిత వీడియోలు, ఫోటోలు, తీసి యాప్ లో అప్లోడ్ చేసినచో ఫిర్యాదు అందిన వెంటనే సంబంధిత అధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకుంటారు. కావున నంగునూరు మండల గ్రామాలలోని ప్రజలు యువకులు ఈ యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని, రాజగోపాల్ పేట ఎస్సై మోహన్ రెడ్డి తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking