బీసీని ముఖ్యమంత్రి ప్రకటించిన బిజెపికి కృతజ్ఞతలు

వరంగల్, అక్షిత బ్యూరో: తెలంగాణ రాష్ట్ర శాసనసభకు జరగబోతున్న ఎన్నికలలో బిజెపికి అవకాశం ఇస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తామని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ప్రకటించటాన్ని బీసీ జాక్ స్వాగతిస్తుందని డాక్టర్ తిరునాహరి శేషు తెలియజేశారు బీసీకి ముఖ్యమంత్రిగా అవకాశం కల్పిస్తామని ప్రకటించినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖ ద్వారా కృతజ్ఞతలు తెలియజేసినారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి 16 మంది ముఖ్యమంత్రులుగా పనిచేసినా ఒక్కసారి కూడా బీసీకి ముఖ్యమంత్రిగా అవకాశం దక్కలేదు అలాగే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తరువాత జరిగిన రెండు శాసనసభ ఎన్నికలలో కూడా బీసీలకు అధికారంలో సరైన ప్రాతినిధ్యం దక్కలేదని అభిప్రాయపడినారు. తెలంగాణ రాష్ట్ర శాసనసభకు జరగబోతున్న ఎన్నికలలో బిఆర్ఎస్ బీసీలకు 22 శాసనసభ స్థానాలను కాంగ్రెస్ కేవలం 20 శాసనసభ స్థానాలను కేటాయిస్తే బిజెపి 40 కి పైగా శాసనసభ స్థానాలను కేటాయిస్తామని హామీ ఇవ్వటాన్ని కూడా స్వాగతిస్తున్నాం. బీసీలకు చట్టసభలలో రిజర్వేషన్లు దేశవ్యాప్తంగా కుల గణన కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ విషయంలో కూడా సానుకూలమైన నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేసినారు. ఈ కార్యక్రమంలో చిన్నాల యశ్వంత్ యాదవ్ వినయ్ చారి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking