బిజెపి ఆత్మీయ సమ్మేళనం

బిజెపి ఆత్మీయ సమ్మేళనం

తుర్కయంజాల్ అక్షిత ప్రతినిధి:

ఇబ్రహీంపట్నం నియోజకవర్గం బిజెపి పార్టీ ముఖ్య కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం శనివారం రోజు ఇంజాపూర్ లోని బిజెపి పార్టీ అభ్యర్థి నోముల దయానంద గౌడ్ కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని భాజాపా నేతలంతా హాజరయ్యారు. ప్రతి ఓటరును ఏ విధంగా చేరుకోవాలో, కేంద్ర రాష్ట్ర పథకాల్ని ఏ విధంగా వారికి వివరించాలో, ప్రత్యర్థి పార్టీల నాయకుల అబద్దాలను ఏ విధానంగా తిప్పి కొట్టాలో నాయకులు దిశా నిర్ధేశం చేశారు. ఆదివారం వైష్ణవి గార్డెన్స్ లో నిర్వహించనున్న బూత్ కమిటీ సభ్యుల సమావేశాన్ని జయప్రదం చేయాల్సిందిగా నాయకులకు విజ్ఞప్తి చేశారు. అనంతరం అభ్యర్థి నోముల దయానంద్ గౌడ్ మాట్లాడుతూ తనమీద నమ్మకంతో టికెట్ అందించిన అధిష్టానానికి, తనకు అండగా నిలబడిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చేశారు. తాను కలుపుగోలు మనిషినని, తనకు తన పర భేదం లేదని, భాజాపా నా కుటుంబమని ఉద్వేగంగా మాట్లాడారు. ప్రతి కార్యకర్తకు శిరసువంచి ప్రణమిల్లుతూ ఈ రోజు మనం భారతీయ జనతా పార్టీ పక్షాన నిలబడకపోతే తెలంగాణ మరో వందేళ్లు వెనక్కి వెళ్తుందని, నియోజకవర్గం అభివృద్ధి శూన్యంగా మారిపోతుందని తెలియజేసారు. రేపటి సమావేశానికి ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి సంబంధించిన ప్రతి బూత్ సభ్యుడు స్వచ్చందంగా తరలిరావాలని పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో భాజాపా జిల్లా ఇంచార్జ్ అరుణ్ కుమార్, జిలా మాజీ అధ్యక్షులు పి నరసింహారెడ్డి, వనపర్తి జిల్లా ఇంచార్జ్, రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యులు బోసుపల్లి ప్రతాప్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు లచ్చిరెడ్డి, అశోక్ గౌడ్, జిలా ప్రధాన కార్యదర్శి అర్జున్ రెడ్డి, కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంజయ్య యాదవ్, జిల్లా ఉపాధ్యక్షులు దన్నే బాషయ్య, పాపయ్య గౌడ్, పార్లమెంటరీ జాయింట్ కన్వీనర్ నారాయణ యాదవ్, అసెంబ్లీ కన్వీనర్ ఎన్ యాదగిరి రెడ్డి, మంచాల మండల ఉపాధ్యక్షురాలు రాజేశ్వరి, ఎస్సి మోర్చా జిల్లా అధ్యక్షులు బి రమేష్, ఎస్టీ మోర్చా జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ నాయక్, నాయక్, మండల అధ్యక్షులు తూళ్ల నర్సింహ్మ గౌడ్, బండారు విష్ణు గౌడ్,శిగ వీరస్వామి గౌడ్, దండే శ్రీశైలం యాదవ్, బూడిద నర్సింహ రెడ్డి, తాండ్ర రవీందర్, గోవర్ధన్ చారి, యువమోర్చా జిల్లా ఉపాధ్యక్షులు ప్రేమ సాయి, పగడాల శ్రీశైలం, బాల వర్ధన్ రెడ్డి తదితర ముఖ్య నేతలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking