ఆపదలో ఉన్న కుటుంబాలకు అండగా సర్పంచ్ – నల్లు రామచంద్రారెడ్డి.
తుంగతుర్తి అక్షిత ప్రతినిధి…..
మృతుల కుటుంబాలతో పాటు ఆపదలో ఉన్న కుటుంబాలకు పెద్ద దిక్కుగా ఉంటు, బాధిత కుటుంబాలకు ఆర్థిక చేయుతనిస్తు తన గొప్ప మనసును చాటుకుంటున్నా గానుగుబండ గ్రామ సర్పంచ్ నల్లు రామచంద్రారెడ్డి. మండల పరిధిలోని గానుబండ గ్రామానికి చెందిన పోలెపాక గగన్ దీప్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. విషయం తెలిసిన సర్పంచ్ నల్ల రామచంద్రారెడ్డి తక్షణమే స్పందించిన గగన్ దీప్ కుటుంబానికి రూ.10,000/- తక్షణ ఆర్ధిక సహాయం తో పాటు క్వింట బియ్యం కుటుంబ సభ్యులకు శనివారం అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ నల్లు రామచంద్రారెడ్డి మాట్లాడుతూ… గ్రామంలోని ప్రతి పేద కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటానని, తెలిపారు. గ్రామస్తులు మాట్లాడుతూ.. బాధితులు ఆత్మస్థైర్యంతో ఉంటూ మాకు ఆపద అంటే రామచంద్రారెడ్డి సహాయం తప్పక వస్తుందని ధైర్యంగా ఉంటున్నారని తెలిపారు. గ్రామ ప్రజలను ఎల్లవేళలా ఆదుకుంటూ, ఎవరికి ఏ ఆపద వచ్చినా, అన్నా…అంటే నేనున్నా అంటూ, తన సహాయ సహకారాలు అందిస్తున్న పేద గరిబోళ్ల గుండెల్లో గూడు కట్టుకున్నారని, నిరుపేద కుటుంబాలకు పెద్ద కొడుకు అయ్యారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు గుండగాని రాములు , ఉప సర్పంచ్ పోలేపాక పరమేష్, గ్రామ శాఖ అధ్యక్షుడు గుండగాని శ్రీనివాస్, మాజీ అధ్యక్షుడు కంచర్ల కుశలవ రెడ్డి, యూత్ అధ్యక్షుడు పంజాల ప్రవీణ్,వీరన్న, పంజాల యాదగిరి, పోలెపాక సోమయ్య, మల్లేష్, రమేష్, వార్డ్ మెంబర్లు సూర్య ప్రకాష్, కట్ల చంద్రయ్య, తదితరులు పాల్గొన్నారు.