కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశం
మేడ్చల్, అక్షిత బ్యూరో :
దుండిగల్ పురపాలక పరది బహదూర్ పల్లి గ్రామంలో శనివారం కాంగ్రెస్ పార్టీ దుండిగల్ మున్సిపాలిటీ ఓ బి సి అధ్యక్షుడు కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో. ముఖ్య కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల సమావేశం నిర్వహించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సాధు యాదవ్ మాట్లాడుతూ. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి శ్రీ కొలాన్ హనుమంత్ రెడ్డి కి మనమందరం పూర్తి మద్దతుతో అందరూ కలిసికట్టుగా పార్టీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఒక్కొక్కరి మనసులో విభేదాలు లేకుండా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ముందుకు వచ్చి సంహితంగా ఎన్నికల్ల ప్రచారంలో పాల్గొని. మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవాలని అన్నారు. మనం చూస్తున్నాం బిఆర్ఎస్ పార్టీ ఎక్కడ చూసినా కబ్జాల పరం చెరువుల్లో కుంటలు మటుమాయం రాబోయే నేటి యువతకు కనీసం ప్రభుత్వ భూములు కానరాకుండా అయిపోతున్నాయి ఎక్కడ చూసినా కబ్జాల పరం కోట్ల కోట్లు కొల్లగొడుతున్నారు యా రాబోయే రోజుల్లో కేసీఆర్ పాలనకు చరమగీతం పాడాలని అందరం కలిసికట్టుగా పనిచేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు…