తాజా పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు

తాజా పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు:

అక్షిత, చిట్యాల :

తాజా పండ్లను తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని గ్రీన్ గ్రో పాఠశాల డైరెక్టర్ జూలకంటి వేణుగోపాల్ రెడ్డి అన్నారు. శనివారం పట్టణ కేంద్రంలోని పాఠశాలలో నిర్వహించిన పండ్ల పోషక విలువల పై అవగాహన సదస్సు కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
ఎలాంటి రసాయనాలు వాడకుండా
సహజ సిద్ధంగా లభించే తాజా పండ్లు తింటే ఆరోగ్యం ఎంతో మెరుగు అవుతుందన్నారు. ప్రస్తుత యాంత్రిక జీవనంలో పిల్లలకు సరిగ్గా పోషక విలువలు అందకుండా జంక్ ఫుడ్ కు అలవాటు పడి అనారోగ్యం పాలవుతున్నారని అన్నారు. ప్రతిరోజు తాజా పండ్లు తీసుకుంటే ప్రోటీన్లు, విటమిన్లు, సరైన పోషక విలువలు అందుతాయన్నారు. సహజ సిద్ధంగా పండించిన పండ్లు తింటే ఏవిధంగా ఆరోగ్యంగా ఉంటారో ప్రయోగాత్మకంగా అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ బండి వీణ, ఏ.ఓ పోల గోవర్ధన్, వ్యాయామ ఉపాధ్యాయుడు రాము, ఉపాధ్యాయిని ఉపాధ్యాయుల విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు…

Leave A Reply

Your email address will not be published.

Breaking