రాష్ట్ర స్థాయి యోగ పోటీలలో పాల్గొనే క్రీడాకారులకు దుస్తుల పంపిణీ
వరంగల్,అక్షిత బ్యూరో :
67వ పాఠశాలల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో, సిద్దిపేట లో జరిగే రాష్ట్ర స్థాయి యోగ పోటీలలో పాల్గొనే ఉమ్మడి వరంగల్ జిల్లా జట్టుకు క్రీడాకారులకు వరంగల్ జిల్లా యోగ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రీడా కారులకు దుస్తులను అందచేశారు. ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా యోగ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ కె చంద్రశేఖర్ ఆర్య కార్యదర్శి బొలిశెట్టి కమలాకర్ కోశాధికారి పాకాల రవీందర్ తీగల శ్రీనివాస్ ఎండి పాషా కుండే కిరణ్, కోట రజిత హనుమకొండ పాఠశాలల స్థాయి క్రీడ సమైక్య కార్యదర్శి దురుసు నాయక్ , కుమార్, కిషన్ తదితరులు పాల్గొన్నారు