కదిలిన ఎర్ర దండు
ఎరుపెక్కిన మిర్యాలగూడ
తగ్గేదెలే అంటున్న పార్టీ శ్రేణులు
అశేష జనవాహినితో భారీ ర్యాలీ
అడుగడుగున పులవర్షంతో నీరాజనం
బిజెపి, బీఆర్ఎస్ ప్రభుత్వాలను గద్దె దించాలి
కేంద్ర కమిటీ సభ్యులు, మాజీ ఎంపీ మధు
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
మిర్యాలగూడ సిపిఎం అభ్యర్థి జూలకంటి రంగారెడ్డి నామినేషన్ సందర్భంగా శుక్రవారం ఎర్రదండు కదిలింది. నియోజవర్గ వ్యాప్తంగా స్వచ్ఛనంగా వేలాది మంది ప్రజలు తరలివచ్చి ఎర్ర జెండా నినాదాలు చేశారు.తామేమీ తక్కువ కాదంటూ ఎర్రజెండాలు చేతబట్టి టీ షర్టులు చీరలు కట్టుకొని భారీ ర్యాలీ నిర్వహించారు. హనుమాన్ పేట ఫ్లైఓవర్ బ్రిడ్జి నుండి శకుంతల థియేటర్ ఆర్టిసి బస్టాండ్ పొట్టి శ్రీరాములు సెంటర్ అంబేద్కర్ చౌరస్తా రాజీవ్ చౌక్ మీదుగా ఆర్డీవో కార్యాలయం వరకు వేలాది మందితో ర్యాలీ నిర్వహించారు. సుమారు కిలోమీటర్ మేరకు ర్యాలీ సాగింది. ర్యాలీ జరుగుతున్న సమయంలో కార్మికులు, హమాలీలు, పూల, పండ్ల వ్యాపారులు ఎదురెళ్లి పూలమాలలతో ఘనంగా సన్మానించారు.పండ్ల వ్యాపారి మహమ్మద్ షకీల్ ఆధ్వర్యంలో గజమాలవేసి అభిమానాన్ని చాటుకున్నారు.
అడుగడుగునా పూల వర్షం కురిపించారు. జనాలతో ఇరువైపుల రోడ్లు కిక్కిరిసిపోయాయి. ట్రాఫిక్ అంతరాయం కాకుండా వాహనాలను దారి మళ్లించారు. బిజెపి బిఆర్ఎస్ ప్రభుత్వాలను గద్దెదించాలి…మాజీ ఎంపీ మధు
ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న బిజెపి బీఆర్ఎస్ ప్రభుత్వాలను గద్దె దించాలని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు మాజీ ఎంపీ మధు పిలుపునిచ్చారు. జూలకంటి రంగారెడ్డి నామినేషన్ సందర్భంగా ర్యాలీలో పాల్గొని మాట్లాడారు. దేశాన్ని దోచుకు తింటున్న మోడీకి వ్యతిరేకంగా ఇండియా కూటమి ఏర్పడిందని మతోన్మాద బిజెపిని ఓడించడమే లక్ష్యంగా మిత్రపక్షాలు పనిచేస్తున్నాయన్నారు. దేశంలో మోడీ చరిస్మ తగ్గిపోతుందని మోడీని ఇంటికి పంపించి విపక్షాల సత్తా ఏమిటో చూపిస్తామని హెచ్చరించారు.
ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ ను అప్పుల రాష్ట్రంగా మార్చి ప్రభుత్వ సొమ్మును ఆస్తులను కాజేస్తున్న కేసీఆర్ కు ఎన్నికల్లో ఓడించే బుద్ధి చెప్పాలన్నారు. బిజెపితో లోపాయి కారికంగా ఒప్పందం ఉండడం వల్లనే కేసీఆర్ వామపక్షాలతో స్నేహాన్ని వదులుకున్నాడని విమర్శించారు. 10 సంవత్సరాల కాలంలో అనేక అబద్ధాలు చెప్పి మోసపూరిత వాగ్దానాలతో ప్రజలను మోసం చేశాడని ఈసారి ప్రజలు కేసీఆర్ను కుర్చీ దింపేందుకు సిద్ధమయ్యారని చెప్పారు. తెలంగాణలో కేసీఆర్ మాటలను నమ్మే పరిస్థితి తెలంగాణ ప్రజలు లేరన్నారు. బిజెపిని ఓడించేందుకు ఇండియాకుటమి పనిచేస్తుంటే కేసీఆర్ను గద్దె దించాలని లక్ష్యంతో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకునేందుకు చూసామని కానీ కాంగ్రెస్లో కొంతమంది ఉన్న నాయకుల కారణంగా పొత్తు కాలేదన్నారు. ఇచ్చిన హామీని నిలుబెట్టుకోకుండా కాలయాపన చేయవలెను సిపిఎం ఒంటరిగా పోటీ చేస్తుందని చెప్పారు సిపిఎం పై ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. సిపిఎం పార్టీ సత్తా ఏమిటో ఈ ఎన్నికల్లో చూపిస్తామని సవాల్ విసిరారు. ప్రజల కోసం పనిచేసే ప్రజా నాయకుడైన జూలకంటి రంగారెడ్డిని గెలిపించాలని కోరారు.
పేదల పక్షాన పోరాడే రంగన్న…ఎమ్మెల్సీ నర్సిరెడ్డి
పేదల పక్షాన నిరంతరం రాజీలేని పోరాటాలు చేసేది జూలకంటి రంగారెడ్డి అని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా ఉండి అనేక ప్రజా సమస్యలను అసెంబ్లీలో లేవనెత్తి వాటి పరిష్కారం కోసం విశేష కృషి చేశారని చెప్పారు. చట్టసభలో వామపక్షాలు లేని లోటు తీవ్రంగా కనిపిస్తుందని దీనివలన ప్రజా సమస్యలు మరుగున పడతున్నాయని అన్నారు. పదవి ఉన్నా లేకున్నా నిరంతరం ప్రజల కోసం పనిచేసే జూలకంటి రంగారెడ్డిని గెలిపిస్తే ప్రజా సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పారు. బిజెపి బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు మోసపూరిత వాగ్దానాలు చేస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. అమలకు నోచుకోని హామీలు ఇస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని చెప్పారు.
మోసగాళ్ల మాటలను నమ్మొద్దు…జూలకంటి
ఎన్నికల్లో మోసపూరిత వాగ్దానాలు ఇచ్చే మోసగాళ్ల మాటలను నమ్మొద్దని సీపీఎం అభ్యర్థి జూలకంటి రంగారెడ్డి అన్నారు. బిఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులు ప్రజలకు మాయమాటలు చెబుతూ ఓటు వేయించుకోవాలని చూస్తున్నారని అలాంటి వారి మాటలను నమ్మితే భవిష్యత్తులో మోసపోతారని చెప్పారు. వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని డబ్బు సంచులతో వచ్చి ఓట్ల ను కొని అధికారంలోకి రావాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరిస్తూ డబ్బులను నమ్ముకొని ప్రజలను ప్రయత్నిస్తున్నారు. మిర్యాలగూడలో ధన బలం పోరాడే బలం మధ్య ఎన్నికల జరుగుతున్నాయని ప్రజలు ఓటు వేసేటప్పుడు ఆలోచించుకొని ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ఐదేళ్లు పాలించే ప్రజానాయకుడు ఎలా ఉండాలో మీరే తెలుసుకోవాలని నిరంతరo ప్రజలకు అందుబాటులో ఉంటూ అందరి వాడిలా అన్ని వర్గాల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నానని చెప్పారు తనకు ఓటు వేసి గెలిపిస్తే మిర్యాలగూడను జిల్లాగా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తానన్నారు. దీనికి తోడు మహిళా డిగ్రీ కళాశాల మంజారుకు పాటుపడతారన్నారు. ఇప్పటివరకు మిర్యాలగూడకు గుర్తింపు తెచ్చేందుకు కృషి చేశానని భవిష్యత్తులో ప్రజల నమ్మకాన్ని మమ్ము చేయకుండా మిర్యాలగూడ గౌరవాన్ని పెంచుతానన్నారు. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో గళ మెత్తెందుకు అవకాశం కల్పించాలని చెప్పారు.ఈ కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీ సాగర్, తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ రామ్ నాయక్, సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఎస్ వి రమ, నారి ఐలయ్య, డబ్బి కార్ మల్లేష్, గిరిజన సంఘం రాష్ట్ర నాయకులు రవి నాయక్ డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్, సిఐటియు రాష్ట్ర నాయకులు లక్ష్మీనారాయణ జిల్లా కమిటీ సభ్యులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, రవి నాయక్, డాక్టర్ మల్లు గౌతమ్ రెడ్డి, భవాండ్ల పాండు, పాదురి శశిధర్ రెడ్డి,రాగిరెడ్డి మంగా రెడ్డి, పరుశురాములు, వరలక్ష్మి, వినోద్ నాయక్, సీతారాములు, గోవర్ధన, రొండి శ్రీనివాస్, బాల సైదులు తదితరులు పాల్గొన్నారు.