మూసాపేటలో బిఆర్ఎస్ నుండి ప్రేమ కుమార్ ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరికలు..
కూకట్ పల్లి, అక్షిత ప్రతినిధి:
కూకట్పల్లి నియోజకవర్గం లోని మూసాపేట్ డివిజన్ లో బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ ని బలపరుస్తూ బిఆర్ఎస్ పార్టీ లోనుండి వి శ్యామ్ సుందర్ ఆధ్వర్యంలో జనసేన లో పార్టీ లో చేరారు. దాదాపు 150 మందికి పైగా పార్టీ తీర్థం పుచ్చుకోగా ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ వారికీ పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ మాట్లాడుతూ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు టీడీపీ నుండి గెలిచి 26 కులాలు బీసీ కలపటానికి పార్టీ మారుతున్నానని చెప్పి కూకట్పల్లి ప్రజలను మోసం చేసారన్నారు. కూకట్పల్లి ప్రజలు బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి గా నన్ను గెలిపిస్తే 26కులాలను బీసీ లో కలపడం తోపాటు తాను ప్రజలకిచ్చే హామీలన్నీ నేరవేరుస్తామని తెలిపారు.ప్రజలు గాజు గ్లాసు గుర్తుకు ఓటేసి నన్ను గెలిపింంచాలని కోరారు.ఈ కార్యక్రమం లో స్థానిక కార్పొరేటర్ కొడిచర్ల మాహేందర్, శైలేష్ కుమార్,యంజాల పద్మయ్య,శ్రీకర్ రావు,మనోహర్, నాగేంద్ర, తుమ్మల మోహన్, నాగేష్ తదితరులు పాల్గొన్నారు.