రైతుల నోట్లో మట్టి కొట్టేటోళ్ళు కావాల్నా.. రైతు బాంధవుడు కెసిఆర్ కావాల్నా..

రైతుల నోట్లో మట్టి కొట్టేటోళ్ళు కావాల్నా.. రైతు బాంధవుడు కెసిఆర్ కావాల్నా…
ఎమ్మెల్యే అభ్యర్థి నల్లమోతు

అక్షిత న్యూస్ మాడుగుల పల్లి:

దేశానికి అన్నం పెట్టె రైతాంగానికి బీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుందని రైతు సంక్షేమం కోసం పథకాలు రూపొందించి అమలు చేయడం జరిగిందని మిర్యాలగూడ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యె అభ్యర్థి నల్లమోతు భాస్కర్ రావు అన్నారు మంగళవారం మాడ్గులపల్లి మండలంలోని కుక్కడం గండ్రవాని గూడెం ఇస్కబావిగూడెం తోపుచర్ల సీత్యాతండ భీమనపల్లి కల్వలపాలెం తదితర గ్రామాల్లో బిఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రగతి యాత్ర జరిగింది ఆయా గ్రామాల్లో ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి అపూర్వంగా స్వాగతించారు అనంతరం మహిళ కోలాట బృందం వాడ వాడనా కలియ తిరుగుతూ పలువురిని ఆకర్షించారు పూలమాలులు వేసి శాలువాలతో సత్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి భాస్కర్ రావు మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో కేసీఆర్ తీసుకొచ్చిన అనేక పథకాలు వ్యవసాయ అభివృద్ధికి తోడ్పడింది
తాగు సాగునీరు విద్యుత్ రహదారుల సౌకర్యాలతో పట్టణాల కు వెళ్ళిన ప్రజలు తిరిగి గ్రామాలకు వస్తున్నారు
గత రెండు మ్యానిఫెస్టో లను నూటికి నూరు శాతం అమలు చేసిన కేసీఆర్ మూడవ మూడవసారి చెప్పిన పథకాలు కూడా అమలు చేస్తారనే నమ్మకం ప్రజలకు ఉంది ప్రజలకు ఏం చేస్తాము చెప్పలేని దౌర్భాగ్య పరిస్థితిలో కాంగ్రెస్ నేతలు ఉన్నారు ఎన్నికలు అయిపోక ముందే సీఎం కుర్చీ కోసం కొట్లాడుకుంటున్న దౌర్భాగ్యపు పరిస్తితి కాంగ్రెస్ది అహంకారంతో కాంగ్రెస్ నేతలు పనిచేస్తున్నారు ఈ అహంకారులకు బుద్ధి చెప్పడానికి నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా ఉన్నారు.60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో నల్గొండ జిల్లాకు ఒరిగింది ఏమీ లేదు
బీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలో సౌభాగ్యలక్ష్మీ పథకం అన్నపూర్ణ పథకం, కెసిఆర్ భీమా కేసీఆర్ ఆరోగ్య రక్ష పథకాలతో పాటు రైతుబంధు పెంపుదల ఆసరా పెన్షన్లు పెంపుదల చేసి లబ్ధి చేరూర్చనున్నామని తెలిపారు సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని బలపరిచేందుకు కారు గుర్తుకు ఓటేసి, తనను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు అలుగుబెల్లి అమరేందర్ రెడ్డి,ఎంపీపీ పోకల శ్రీవిద్యరాజు,బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నిమ్మల నవీన్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పాలుట్ల బాబయ్య,నామిరెడ్డి కరుణాకర్ రెడ్డి,జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు మోసిన్ అలి, పిఏసిఎస్ చైర్మన్ జెరిపోతుల రాములుగాడ్,సర్పంచులు అలుగువెల్లి గోవిందరెడ్డి, నిమ్మల గోవిందమ్మ ,మారుతి వెంకట్ రెడ్డి,గడ్డమీద సైదులు, వాంకుడోత్ సుధాకర్,రాయరపు వెంకన్న,చింతమల్ల ఆనంద్ కుమార్,పోరెడ్డి శ్రీనివాస్ రెడ్డి,రాయరపు, జానకి రాములు, అంజిరెడ్డి, గోపాల్ రెడ్డి,కర్ర శ్రీనివాస్ రెడ్డి నాయకలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking