బిజెపి అధికారంలోకొస్తే బీసీ ముఖ్యమంత్రి.. సాదినేని

బిజెపి అధికారంలోకొస్తే బీసీ ముఖ్యమంత్రి.. సాదినేని

అక్షిత న్యూస్ మాడుగులపల్లి:

ఎన్నికల ప్రచారంలో భాగంగా మాడుగులపల్లి మండల పరిధిలోని గ్రామాలైన గుర్రప్పగూడెం, ఆగ మోత్కూర్, చిరుమర్తి, పోరెడ్డిగూడెం, కల్వల పాలెం, పాములపాడు, బొమ్మకల్, చర్లగూడెం, భీమనపల్లి, సీత తండా, తోపుచర్ల, కుక్కడం, గండ్రవానిగూడెం, గ్రామాలలో బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి సాధినేని శ్రీనివాసరావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రి ని చేస్తాననడం సంతోష కరమని కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీల మాటలు నమ్మి ప్రజలు మోసపోద్దని సూచించారు. రేపు రాబోయేది తెలంగాణలో బిజెపి ప్రభుత్వమని కొనియాడారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు బొమ్మ కంటి నరసింహ,జిల్లా ఉపాధ్యక్షుడు పల్నాటి రామ్ రెడ్డి, కిసాన్ మోర్చా అధ్యక్షుడు చల్ల సీతారాంరెడ్డి,జిల్లా నాయకులు సజ్జల నాగిరెడ్డి, మండల ఇన్చార్జి పో రెడ్డి సురేందర్ రెడ్డి, మండల పార్టీ ప్రధాన కార్యదర్శులు గోడిగుంట్ల శ్రీనివాస్,ఇటికల జాన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking