బిఆర్ఎస్ కు బిగ్ షాక్ కాంగ్రెస్ లో భారీ చేరికలు

బిఆర్ఎస్ కు బిగ్ షాక్ కాంగ్రెస్ లో భారీ చేరికలు.

ఆమనగల్లు నుండి కాంగ్రెస్ పార్టీలో చేరికలు:

అక్షిత ప్రతినిధి :
ఈ రోజు వేములపల్లి మండలంలోని ఆమనగల్లు గ్రామపంచాయతీ నుండి వివిధ పార్టీ లకు చెందిన నాయకులు వేములపల్లి మండల ఎంపీపీ పుట్టల సునీత- కృపయ్య, ఆమనగల్లు సర్పంచ్ వల్లంపట్ట ఝాన్సీ – ప్రవీణ్ నాయకత్వంలో బత్తుల లక్ష్మారెడ్డి(BLR) గారి సమక్షంలో మంగళవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు.చేరిన వారిలో బిఆర్ఎస్ నుండి దేవాలయ కమిటీ మాజీ చైర్మన్ అలుగుబెల్లి వెంకటేశం, శక్తి కేంద్ర మండల ప్రధాన కార్యదర్శి మేక జయరాజు, బిజెపి బూత్ అధ్యక్షులు చింతకాయల సైదులు తదితరులు పార్టీలో చేరారు.. వీరి వెంట మండలానికి చెందిన కందుకూరి సుదర్శన్, పేరెల్లి నాగేష్ , వేములపల్లి మాజీ సర్పంచ్ రేగట్టి రవీందర్ రెడ్డి, ఏల నాగేశ్వరరావు, మాతంగి చంటి, దైద గిరి, మహమూద్, ఎస్సీ సెల్ మాడుగులపల్లి మండల అధ్యక్షులు పందిరి వెంకన్న, మండలానికి చెందిన కందుకూరి వీటీ తదితరులు పాల్గొన్నారు..

Leave A Reply

Your email address will not be published.

Breaking