జోరుగా సాగుతున్న కాంగ్రెస్ ప్రచారం
అక్షిత చిట్యాల:
చిట్యాల మున్సిపల్ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వివిధ వార్డులలో పార్టీ నాయకులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. మంగళవారం పట్టణ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో భాగంగా గడపగడపకు ఓటర్లను కలుస్తూ చిరు వ్యాపారస్తును కలుస్తూ వేముల వీరేశం చెయ్యి గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పోకల దేవదాస్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు చేపూరి యాదయ్య, ఎద్దుల పురి కృష్ణ, రెమిడాల మధు, ముప్పా ముత్తిరెడ్డి, మన్నెం సైదులు, సాగర్ల గోవర్ధన్ దామనూరి సైదులు, చోల్లేటి శ్రీకాంత్,వీరయ్య, జిట్ట చంద్రకాంత్,రమేష్ తదితరులు పాల్గొన్నారు..