జూలపల్లి గ్రామంలో భారీగా మద్యం పట్టివేత
కల్వకుర్తి అక్షిత ప్రతినిధి :
తలకొండపల్లి మండలంలోని జూలపల్లి గ్రామంలో 19,30,000 విలువచేసే మద్యాన్ని పట్టుకున్నట్లు ఎలక్షన్ అడిషనల్ డీసీపీ. నరసింహారెడ్డి తెలిపారు. మంగళవారం తలకొండపల్లి పోలీస్ స్టేషన్ లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఎఫ్.ఎస్ టి.మరియు లోకల్ పోలీసుల సహకారంతో విశ్వాసనీయ సమాచార మేరకు జూలపల్లి గ్రామంలోని జైపాల్ రెడ్డి ఫామ్ హౌస్ పై పోలీసులు దాడి చేసి.1762. లీటర్ల లిక్కర్ను స్వాధీనం చేసుకున్నట్లు దీన్ని విలువ సుమారు 19.30.000 వేల రూపాయల ఉంటుందని ఆయన తెలిపారు జైపాల్ రెడ్డి. లక్ష్మారెడ్డి యాదయ్య. రాజులపై.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు. ఎన్నికల నిమిత్తం మద్యం తెచ్చారని ఆయన తెలిపారు అక్రమంగా మధ్యము అమ్మినా తరలించిన వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అదే విధంగా మండలంలో నాలుగు సమస్యాత్మక గ్రామాలను గుర్తించినట్లు ఈ గ్రామాలలో ప్రత్యేక భద్రత ఏర్పాట్లు చేసినట్లు అదనంగా పోలీస్ సిబ్బందిని రప్పిస్తున్నట్లు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆమనగల్ సిఐ వెంకటేశ్వర్లు. తలకొండపల్లి ఎస్ఐ శ్రీనివాస్ పోలీస్ సిబ్బంది ఎఫ్ ఎస్ టి సిబ్బంది తదితరులు ఉన్నారు