“రాజా”కు అంతర్జాతీయ ఖ్యాతి
ఇంటర్నేషనల్ ఐకాన్ అవార్డు
దుబాయ్ క్యాబినేట్ మంత్రి
షేక్ మక్సూద్ అలీఖాన్ చేతుల మీదుగా రాజాకు అవార్డు
ముచ్చటగా మూడేళ్లుగా అవార్డుల పంట
హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :
“రాజా”కు అంతర్జాతీయ ఖ్యాతి లభించింది. ఇంతిoతై వటుడిoతై అన్న చందంగా రాజా ఇన్ ఫ్రా ఖ్యాతి ఖండాంతరాలు దాటింది. దుబాయ్ క్యాబినేట్ మంత్రి షేక్ మక్సూద్ అలీఖాన్ చేతుల మీదుగా రాజా ఇన్ ఫ్రా డెవలపర్స్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజు ఇంటర్నేషనల్ ఐకాన్ అవార్డు అందుకుండ్రు. వరుసగా ముచ్చటగా మూడేళ్లుగా రాజా ఇన్ ఫ్రాకు అవార్డుల పంట పండుతుంది. రియల్ రంగంలో విశిష్ట సేవలందిస్తున్న హైదరాబాద్ తార్నాకకు చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ రాజా ఇన్ ఫ్రా డెవలపర్స్ కు ఇంటర్నేషనల్ ఐకాన్ అవార్డు వరించింది.

రియల్ రంగంలో విశిష్ట సేవలందించిన ప్రతిభావంతులకు అందించిన అవార్డుల్లో రియల్ ఐకాన్ యంగ్ అచీవర్ అవార్డును 2021, 2022ల్లోనూ హైదరాబాద్ రవీంద్ర భారతిలో రాష్ట్ర ఎక్సైజ్, ప్రోహిబిషన్, క్రీడలు, యువజన శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మరో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రముఖ రియల్ దిగ్గజం మురళి మోహన్, ప్రముఖ సినీ హీరో శ్రీకాంత్ ల చేతుల మీదుగా అందుకున్న విషయం విధితమే. ప్రస్తుత ఏడాదికి గాను దుబాయ్ లో ఇంటర్నేషనల్ ఐకాన్ అవార్డు అందుకుండ్రు. రియల్ రంగంలో గత పదిహేనేళ్ల చేరువలో మరో మైలు రాయిని దాటారు. ఎంత దూరం పయనమైనప్పటికి తొలి అడుగుతోనే ఆరంభం. రియల్ రంగంలో ఓనమాలు తెలియని స్థితిలో ఎగ్జిక్యూటివ్ గా అరంగ్రేటం చేసి….నాటి కష్టాలు… కడగండ్లను అధిగమించి…ఓ సంస్థకు అధిపతిగా ఎదిగాడు.

నేనొక దుర్గం… నాదొక స్వర్గం… అనితర సాధ్యం నా మార్గమని ఓ మహాకవి అన్నట్లు రాజు జీవన పయనం అనితర సాధ్యoగా ముందుకు సాగుతుంది. లక్ష్యం… గమ్యం ముద్దాడాలనే ఆశయం… కసి… పట్టుదల అతనిని ఉన్నత స్థాయికి చేర్చిందనడంలో అతిశయోక్తి లేదు. అతని సంకల్పం ఉజ్వల భవిష్యత్తు వైపు అడుగులు వేయించి రాజా ఇన్ ఫ్రా డెవలపర్స్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజును రాజా ది గ్రేట్ గా మలచింది. ఇంతితై వటుడింతై అన్న చందంగా ఎదిగిన తీరు… గత స్థితిగతులు తన మస్తిష్కంలో పదిలపర్చుకొండ్రు. అట్టడుగు నుంచి ఉన్నత స్థాయికి చేరుకుని రియల్ రంగంలో రారాజుగా విలసిల్లుతుండ్రు. తొలుత డ్రీమ్ రియాల్టీ అసోసియేట్స్ గా విత్తిన విత్తు తన సరిహద్దులను విశాల పర్చుకొని రాజా ఇన్ ఫ్రా డెవలపర్స్ గా రూపుదిద్దుకుంది.

అందరూ బాగుండాలి… అందులో నేనుండాలనే దృఢ సంకల్పం అతని సొంతం. వయస్సు చిన్నదేనైనా రియల్ మార్కెటింగ్ లో తనకున్న అపార అనుభవం పదుల, వందల, వేలాది మంది కస్టమర్ లను, మార్కెటింగ్ మిత్రులకు చేరువయ్యారు. నాడు ఉన్న ఊరును వదిలి బతుకుదెరువు ఉద్యోగంకై పట్నం బాట పట్టి ప్రస్తుత స్థితితో ఎస్ఎస్ రాజు తనను కన్న తన తలిదండ్రుల కళ్ళలో ఆనందం చూశారు. తన వ్యాపార పయనంలో తనతో పాటు పయనిస్తున్న తన టీంను దృఢసంకల్పంతో దిగ్విజయంగా ముందుకు నడిపిస్తుండ్రు. లక్ష్యాన్ని సాధించడానికి తాను కన్న కలలకు సాకారం చేసుకొంటున్న మహోన్నత దీశాలి ఎస్ఎస్ రాజు. అంధకారాన్ని అధిగమించి వెలుగు రేఖలను విరజిమ్ముతూ తన కలల సౌధమైన రాజా ఇన్ ఫ్రా డెవలపర్స్ ను దివ్య కాంతులతో ప్రసరింప చేస్తుండ్రు. తాను చేస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని ప్రేమిస్తూ అనేకమంది జీవించడానికి ఒక మహర్షిల జీవిస్తున్నారు. తన కలల సామ్రాజ్యం రాజాన్ఫ్రా డెవలపర్స్ ను నలుదిశల విస్తరింప చేస్తూ ఎంతోమంది యువత బంగారు భవితకు బాటలు వేస్తుండ్రు.

ఓ యువకుడిగా రియల్ రంగంలో వేలాదిమంది కస్టమర్లకు విశిష్ట సేవలందించడంతో విశిష్ట ఖ్యాతి గడించారు. ఇంతటి విశిష్ట అవార్డును తీసుకున్న మొదటి రియల్ సంస్థగా నిలిచింది. భారత్ లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న సంస్థగా రాజా ఇన్ ఫ్రాను గుర్తించడం జరిగింది. ఈ అవార్డు పొందుకోవడంతో రాజా ఇన్ఫ్రా డెవలపర్స్ కార్పోరేట్ ఆఫీస్ లో సంబరాలు అంబరాన్నంటాయి.

సేల్స్ డైరెక్టర్ సునీత, అడ్మిన్ రజని, మార్కెటింగ్ డైరెక్టర్ ఐలయ్యల ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా జరిపించారు. ఈ సంస్థ ఇంటర్నేషనల్ అవార్డు అందుకోవడం గర్వకారణం. పలువురు మార్కెటింగ్ అసోసియేట్స్, మిత్రులు, శ్రేయోభిలాషులు రాజును అభినందించారు. మరిన్ని అవార్డులతో మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
విశిష్ట అవార్దుతో
మరింత బాధ్యత
విశిష్ట అవార్దుతో మరింత బాధ్యత పెరిగిందని రాజా ఇన్ ఫ్రా డెవలపర్స్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజు అన్నారు. ఒక సామాన్య స్థాయి నుంచి అంతర్జాతీయ ఖ్యాతి సాధించడం చాలా గర్వంగా ఉందన్నారు. మరిన్ని విశిష్ట సేవలందించేందుకు మరింత బాధ్యతగా పనిచేస్తామని చెప్పారు.
రాజాకు అవార్దు అభినందనీయం
రాజా ఇన్ ఫ్రా డెవలపర్స్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజుకు రియల్ రంగంలో విశిష్ట అవార్డుగా ఇంటర్నేషనల్ ఐకాన్ అవార్డు అందుకోవడం అభినందనీయం మని అక్షిత గ్రూప్ ఆఫ్ న్యూస్ పేపర్స్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ దాస్ మాతంగి అన్నారు. మరిన్ని సేవలందిస్తూ మరెన్నో అవార్డులు అందుకుని మరింత ఉజ్వల భవిష్యత్తు పొందుకోవాలని ఆయన ఆకాంక్షించారు.