కాంగ్రెస్కు ఓటు అడిగా హక్కు ఉందా:- శానంపూడి సైదిరెడ్డి

కాంగ్రెస్కు ఓటు అడిగా హక్కు ఉందా:- శానంపూడి సైదిరెడ్డి

రైతును రాజు చేసిందే బిఆర్ఎస్

చింతలపాలెం మండలాన్ని అభివృద్ధి చేసింది బిఆర్ఎస్

ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడు కావాలా ఢిల్లీలో ఉండే నాయకుడు కావాలో ఆలోచించండి

చింతలపాలెం అక్షిత న్యూస్:-
హుజూర్ నగర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసింది తానేనని ఓటు అడిగే హక్కు తనకు మాత్రమే ఉందని హుజూర్ నగర్ బిఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి అన్నారు. చింతలపాలెం మండల కేంద్రంలో గుడి మల్కాపురం, గాంధీనగర్ తండా, దొండపాడు గ్రామాల్లో సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ ప్రచారంలో కాసోజు శంకరమ్మ,బాణోత్ రమణా నాయక్ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా గ్రామ ప్రజలు,పార్టీ నాయకులు,కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో కోలాటాలతో భారీ ర్యాలీ నిర్వహించారు.అనంతరం ఆయా గ్రామాల్లో మాట్లాడుతూ ఈ నాలుగేళ్ళ లో జరిగిన అభివృద్ధి మీ కళ్ళ ముందు కనిపిస్తుంది.అభివృద్ధి ని చూసి మరోసారి ఆశీర్వదించండి మీ సేవకుడిగా పని చేస్తాను.హనుమంతుని గుడి లేని ఊరు లేదు కేసీఆర్ సంక్షేమ పథకం అందని ఇల్లు లేదు.మీ ఓటు ఎవరికి వేస్తే ఉపయోగం ఉంటదో ఆలోచించి ఓటు వేయాలి.రైతు బంధు వద్దని చెప్పిన వాళ్ళు 3 గంటలు కరెంట్ చాలు అనేవాళ్ళు కావాలా.24 గంటల కరెంట్ ఇచ్చేవాళ్ళు,రైతు బంధు ఇచ్చేవాళ్ళు కావాలా అని ఆలోచించి ఓటు వేయాలని అన్నారు.ఈనెల 30న జరిగే ఎన్నికల్లో ఈవీఎం ప్యాడ్ లో 5 వ నెంబర్ కారు గుర్తుకు ఓటు వేసి,భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.హుజుర్ నగర్ లో అభివృద్ధి, సంక్షేమాన్ని కొనసాగిద్దాం అని అన్నారు.గత పాలకుల హయాంలో ఎటువంటి అభివృద్ధికి నోచుకోని గ్రామాలు,కాలనీలు,ఇప్పుడు చాలా అభివృద్ధి చెంది మంచిగా ఉన్నాయని అన్నారు.సీఎం కేసీఆర్ నాయకత్వం లో గత తొమ్మిదేళ్ల కాలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు – సంక్షేమ పథకాలు చేపట్టామని రాష్ట్రంలో ముచ్చటగా మూడవసారి సీఎం కేసీఆర్ ను గెలిపించుకొని,బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని,మన నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసుకుందామని అన్నారు.ఈ కార్యక్రమంలో మండల నాయకులు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు,ప్రజా ప్రతినిధులు,ముఖ్య నాయకులు,కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking