ఖమ్మం జిల్లాకు సమాచార శాఖ ఏడి ఆఫీస్ మంజూరు

ఖమ్మం జిల్లాకు సమాచార శాఖ ఏడి ఆఫీస్ మంజూరు

-టియుడబ్ల్యూ జే (ఐ జే యు) నేతల విజ్ఞప్తికి స్పందించిన మంత్రి

-ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

-టియుడబ్ల్యూజె (ఐజెయు) హర్షం

-మంత్రి పొంగులేటికి కృతజ్ఞతలు

ఖమ్మం/అక్షిత బ్యూరో :

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఖమ్మం జిల్లా కు సమాచార శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ కార్యాలయాన్ని మంజూరు చేసింది.రాష్ట్ర సమాచార రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని టియుడబ్ల్యూజె (ఐజెయు) రాష్ట్ర ప్రతినిధులు గురువారం సాయంత్రం హైదరాబాదులో కలిసిన కలిసిన సందర్భంలో ఈ విషయాన్ని మంత్రి వెల్లడించారు. ఐజెయు జాతీయ అధ్యక్షులు కె.శ్రీనివాసరెడ్డి జాతీయ కార్యదర్శి వై. నరేందర్రెడ్డి టియుడబ్ల్యూజె రాష్ట్ర నాయకులు విరాక్అలీ కె.రాంనారాయణ తదితరులు సమాచార శాఖ మంత్రి పొంగులేటిని కలిసిన సందర్భంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.
రెండు రోజుల క్రితం ఖమ్మంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని టి యు డబ్ల్యూ జే ఐజేయు జిల్లా నేతలు చేసిన విజ్ఞప్తికి స్పందించిన పొంగులేటి పక్షం రోజులో ఏ.డీ కార్యాలయం మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చిన మూడు రోజులకే కార్యరూపంలోకి తీసుకొచ్చారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఖమ్మం జిల్లా కేంద్రంగా ఏ.డి కార్యాలయం ఉండేది.తెలంగాణ విభజన తర్వాత కొత్త జిల్లాల ఏర్పాటుతో ఖమ్మం ఏ.డి కార్యాలయం సూర్యాపేట జిల్లాకు తరలి వెళ్ళిన విషయం తెలిసిందే.ఏ.డి ఆఫీస్ మంజూరుతో జిల్లా కు అదనంగా రెండు ఏపీఆర్ఓ పోస్టులు, మూడు పబ్లిసిటీ అసిస్టెంట్ పోస్టులు ఒక సీనియర్ అసిస్టెంట్ ఒక టైపిస్టు ఒక రికార్డు అసిస్టెంట్ పోస్టులు రానున్నాయి
ఖమ్మంకు ఏ.డి కార్యాలయం మంజూరి పట్ల టియుడబ్ల్యూజె (ఐజెయు) ఖమ్మంజిల్లా శాఖ హర్షం వ్యక్తం చేస్తూ మంత్రి పొంగులేటికి కృతజ్ఞతలు తెలియజేసింది.కృతజ్ఞతలు తెలియజేసిన వారిలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మాటేటి వేణుగోపాల్ సామినేని కృష్ణమురారి ఎలక్ట్రానిక్ మీడియా రాష్ట్ర నాయకులు నర్వనేని వెంకట్రావు ఖదీర్ టియుడబ్ల్యూజె (ఐజెయు) జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వనం వెంకటేశ్వర్లు ఏనుగు వెంకటేశ్వరరావు ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆవుల శ్రీనివాస్ కనకు సైదులు నగర అధ్యక్ష కార్యదర్శులు మైసా పాపారావు చెరుకుపల్లి శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. సమాచార శాఖ పురోభివృద్ధికి మరింత సహకారం అందించాలని జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి త్వరితగతిన చర్యలు తీసుకోవాలని టియుడబ్ల్యూజె (ఐజెయు) కోరింది.

Leave A Reply

Your email address will not be published.

Breaking