ఘనంగా షేక్ ఫాతిమా జయంతి వేడుకలు
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
జ్యోతిరావు పూలే సావిత్రి భాయి పూలే తో కలిసి విద్యా బోధన చేసిన భారతదేశపు మొట్టమొదటి ముస్లిం మహిళా ఉపాధ్యాయురాలు ఫాతిమా షేక్ అని సమూహ రైటర్స్ ఫోరం నాయకులు కస్తూరి ప్రభాకర్ అన్నారు. మంగళవారం ఫాతిమా షేక్ జయంతిని పురస్కరించుకొని స్థానిక మిర్యాలగూడలోని ముస్లిం మైనార్టీ కళాశాలలో మంగళవారం ఆమెకు ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా జనవిజ్ఞాన వేదిక సీనియర్ నాయకులు మౌజం హుస్సేన్ మాట్లాడుతూ జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే స్థాపించిన పాఠశాలలో మొట్టమొదటి ముస్లిం మహిళా ఉపాధ్యాయురాలుగా పని చేయడమే కాకుండా కుల మతాలకతీతంగా స్త్రీ విద్య కోసం కృషిచేసిన భారతదేశ ముస్లిం మహిళా ఉపాధ్యాయురాలని కొనియాడారు. కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక నాయకులు కొండల్ రెడ్డి మ్యాజిక్ ప్రదర్శన ద్వారా విద్యార్థులకు సైన్స్ పై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కందుకూరి సుదర్శన్, పాఠశాల ప్రిన్సిపాల్ అరుణకుమారి, ఉపాధ్యాయునిలు తదితరులు పాల్గొన్నారు.
Prev Post