22న సెలవుదినంగా ప్రకటించాలి
* తెలంగాణ ప్రభుత్వానికి వీహెచ్‌పీ డిమాండ్
హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :
అయోధ్య రామమందిరంలో రామ్‌లల్లా విగ్ర హ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం నేపథ్యం లో సోమవారం సెలవుదినంగా ప్రకటించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి పండరీనాథ్, ఉపాధ్యక్షుడు జగదీశ్వర్, సహకార కార్యదర్శి భానుప్రసాద్, సంపర్క్ ప్ర ముఖ్ వెంకేటశ్వరరాజు తదితరులు డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి అందుబాటులో లేకపోవడంతో శనివారం సచివాలయంలోని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఓఎస్డీకి వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వం స్పందించి హిందువుల మనోభావాలను గౌరవిస్తూ అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ సందర్భంగా సెలవు దినంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. కేంద్రం హాఫ్‌డే సెలవు ప్రకటించగా, అనేక రాష్ర్టాలు ఇప్పటికే సెలవు దినంగా ప్రకటించాయని అన్నారు.