కూకట్ పల్లి డివిజన్ లో పర్యటించిన జగదీశ్వర్ గౌడ్
కూకట్ పల్లి, అక్షిత ప్రతినిధి:
ప్రజా పాలనకు నిదర్శనంగా కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలనను సాగిస్తుందని,శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రతి బస్తీలో పర్యటించి సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని,ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజలకు అన్ని విధాలుగా అందేలా చూస్తామని శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్ తెలిపారు.

ఆదివారం కూకట్ పల్లి డివిజన్ పరిధిలోని పాపరాయుడు నగర్, ఆస్బెస్టాస్ కాలనీ, పాపి రెడ్డి నగర్, హనుమాన్ నగర్, ప్రగతి నగర్,దినబందు కాలనీ నియోజకవర్గ నాయకులు గొట్టిముక్కల వెంకటేశ్వర రావు మరియు స్థానిక నాయకులతో కలిసి పర్యటించి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఒక్కోటిగా పరిష్కారం చూపే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో మందులా శివ కుమార్,ఏక్ నాథ్ దున్గే,వెంకటేష్ యాదవ్,పోషల రాజు, సోపాన్ రావు,కుమార్ యాదవ్,శ్రీకాంత్ రెడ్డి,అరుణ్,ఎం.డి సయీద్,సాయిలు,నర్సింహ గౌడ్,వెంకటేష్, సురేష్, మరియమ్మ, మల్లేష్,రాము,రామ్ రెడ్డి, కృష్ణ, కిష్టయ్య, దుర్గ ప్రసాద్, రామాంజనేయులు,శ్రీనివాస్, మహేష్, లక్ష్మీనారాయణ, సాగర్ గౌడ్,రవి కిరణ్, సత్తయ్య, నర్సింహ చారి,క్రాంతి కుమార్, మల్లికార్జున్, చంద్రశేఖర్, దేశరథ్,గణేష్,ఆవుల రాజు, చంద్ర మహేష్, పరుశురాం,రాము, మహిళలు,యువకులు తదితరులు పాల్గొన్నారు..