భక్తి పారవశ్యంతో ఆడి పాడిన వడ్డేపల్లి

అయోధ్య రామ మందిరం ప్రాణ ప్రతిష్ట 

ఆధ్యాత్మికంగా మారిన కూకట్ పల్లి పురవీధులు… భక్తి పారవశ్యంతో నృత్యాలు చేస్తూ ఆడి పాడిన వడ్డేపల్లి…

కూకట్ పల్లి , అక్షిత ప్రతినిధి :

కూకట్ పల్లి నియోజకవర్గంలోని కూకట్ పల్లి డివిజన్ లో గల రామాలయం నుండి శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర సంచాలన సమితి కూకట్ పల్లి ఆధ్వర్యంలో నిర్వహించిన బైక్ ర్యాలీలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వర్ రావు పాల్గొని శ్రీరాముల వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ ర్యాలీలో అధిక సంఖ్యలో హిందూ బంధువులు,రామ భక్తులు పాల్గొన్నారు.రామాలయం నుండి ప్రారంభమైన ఈ బైక్ ర్యాలీ కూకట్ పల్లి పురవీధుల నుండి బాలాజీ నగర్, కేపీహెచ్.బీ కాలనీ, భాగ్యానగర్ కాలనీ,వివేకానంద నగర్ కాలనీ ల గుండా తిరుగుతూ రామాలయం చేరుకున్నారు.

ఈ సందర్భంగా వడ్డేపల్లి రాజేశ్వర్ రావు మాట్లాడుతు 500 సంవత్సరాలనుండి ఎదురుచూసిన హిందువుల కల రేపటితో నెరవేరుతుందని అన్నారు.ఈ ర్యాలీతో హిందువుల ఐక్యత మరోమారు ఋజువైందని అన్నారు. ఈ ర్యాలీనీ అనేక మంది హారతులతో స్వాగతం పలికారని అన్నారు.రేపు ప్రతి ఒక్కరూ రాములవారికి ప్రత్యేక పూజలు నిర్వహించాలని, సాయంత్రం దీపాలు వెలిగించాలని అన్నారు. ముందుగా అయోధ్య బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమ శుభాకాంక్షలు తెలిపారు. జై శ్రీరాం, జై హనుమాన్, రామ లక్ష్మణ జానకి జై భోలో హనుమానికి అంటూ నినాదాలతో కూకట్ పల్లి మారుమ్రోగింది. ఈ ర్యాలీలో వడ్డేపల్లి రాజేశ్వర్ రావు నృత్యాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో హిందూ బంధువులు, రామ భక్తులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking