శెట్టిపాలెం ప్రగతికి రూ.6.5 లక్షలు

శెట్టిపాలెం ప్రగతికి
రూ.6.5 లక్షలు

వసంత, ఆదిత్య రైస్ ఇండస్ట్రీస్ చేయూత

సంతోష్ రెడ్డి, కరుణాకర్ లను సత్కరించిన సర్పంచ్ పద్మ సుధాకర్ రెడ్డి

వేములపల్లి, అక్షిత ప్రతినిధి :

వేములపల్లి మండలంలోని శెట్టిపాలెం ప్రగతికి వసంత, ఆదిత్య రైస్ ఇండస్ట్రీస్ రూ.6.5 లక్షల విరాళమందించి చేయూతగా నిలిచారు. శెట్టిపాలెంలో విద్యుత్, రహదారులు, మురుగు కాల్వలు,తాగునీరు తదితర మౌళిక సదుపాయాల కల్పనకు గాను శెట్టిపాలెం పంచాయతీ పరిధిలోని రైస్ ఇండస్ట్రీస్ అధినేతలు అండగా నిలిచారు.

వసంత రైస్ ఇండస్ట్రీస్ అధినేత, మిర్యాలగూడ రైస్ మిల్లర్స్ ఉపాధ్యక్షులు ఘంటా సంతోష్ రెడ్డి, ప్రముఖ పారిశ్రామిక వేత్త, ఆదిత్య రైస్ ఇండస్ట్రీస్ అధినేత పబ్బతి కరుణాకర్ లు రూ.6.5 లక్షల విరాళాన్ని సర్పంచ్ మజ్జిగపు పద్మ సుధాకర్ రెడ్డిలకు అందజేశారు. అందును పురస్కరించుకుని 75 వ గణ తంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని సంతోష్ రెడ్డి, కరుణాకర్ లకు శాలువాలు కప్పి మెమొంటోలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్బంగా సర్పంచ్ మజ్జిగపు పద్మ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ పంచాయతీ ప్రగతికి రైస్ ఇండస్ట్రీస్ చేయూత అభినంద నీయమన్నారు. గ్రామంలోని మౌళిక సదుపాయాలు కల్పించేందుకు ఈ విరాళం దోహదపడు తుందన్నారు. పంచాయతీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి అగ్రగామిగా నిలిపేందుకు తమ శక్తి వంచన లేకుండా కృషి చేశామన్నారు. పంచాయతీ నిధులకు తోడు రైస్ ఇండస్ట్రీస్ అధినేతల చేయూత పంచాయతీ మరింత ప్రగతికి బాటలు వేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు, మాజీ ఎంపిటిసి మజ్జిగపు సుధాకర్ రెడ్డి, ఎంపీటీసీ పల్లా వీరయ్య, మార్కెట్ కమిటీ డైరెక్టర్ కట్టా మల్లేష్ గౌడ్, గౌరు శ్రీనివాస్, సైదులు, కార్యదర్శి దివ్య నాగిరెడ్డి ఉప సర్పంచ్ కట్టా మట్టమ్మ, వార్డ్ నెంబర్స్, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking