భువనగిరి గురుకుల హాస్టల్లో దారుణం..*

*భువనగిరి గురుకుల హాస్టల్లో దారుణం..*

*ఒకే గదిలో ఇద్దరు విద్యార్థినులు ఆత్మహత్య*

యాదాద్రి భువనగిరి, అక్షిత ప్రతినిధి :

భువనగిరి గురుకుల హాస్టల్లో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు విద్యార్థినులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. శనివారం రాత్రి వేళ ఇద్దరు స్టూడెంట్స్ ఒకే గదిలో ఉరి వేసుకుని నూసైడ్ చేసుకున్నారు. గమనించిన తోటి స్టూడెంట్స్, హాస్టల్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విద్యార్థినుల ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. పరీక్షల భయంతో చనిపోయారా లేదా ఇతర కారణాల వల్ల ఆత్మహత్యకు పాల్పడ్డారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతులను టెన్త్ చదువుతోన్న వైష్ణవి, భవ్యగా గుర్తించారు. ఒకే గదిలో ఇద్దరు విద్యార్థినులు ఆత్మహత్యకు పాల్పడటం హాస్టల్లో సంచలనంగా మారింది. అప్పటి వరకు తమతో కలిసి ఉన్న వారు ఉరి వేసుకుని చనిపోవడంతో తోటి విద్యార్థినులు తీవ్ర భయాందోళనకు అవుతున్నారు. కాగా, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Leave A Reply

Your email address will not be published.

Breaking