గ్రామ బొడ్రాయి వేడుకల్లో పాల్గొన్న డిసిసి అధ్యక్షులు కొమ్మూరి
చేర్యాల (మద్దూరు), ఫిబ్రవరి 11 అక్షిత ప్రతినిధి: మద్దూర్ మండల కేంద్రంలో అంగరంగ వైభవంగా జరిగిన బొడ్రాయి వేడుకలు, ఈ సందర్భంగా ఆదివారం ఈ బొడ్రాయి వేడుకలకు జనగామ జిల్లా డిసిసి అధ్యక్షులు,నియోజకవర్గ ఇన్చార్జి కొమ్మూరి ప్రతాపరెడ్డి హాజరై ప్రత్యేక పూజలతో దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటిసి గిరి కొండల్ రెడ్డి, మ్యాక మల్లేశం,శౌకత్ అలీ, కామిడి రమేష్ రెడ్డి,రాగుల శ్రీనివాస్ రెడ్డి, ముస్త్యాల యాదగిరి, మహిపాల్ రెడ్డి, ఫసి అహ్మద్, ఫరీద్ తదితరులు పాల్గొన్నారు.