ప్రసాద్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రారంభం

కూకట్ పల్లిలో ప్రసాద్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రారంభం

తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ

కూకట్ పల్లి, అక్షిత ప్రతినిధి:

కూకట్ పల్లి ప్రగతి నగర్ రోడ్ లో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రసాద్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని హంగులతో ప్రభుత్వ పథకాలు అమలు చేస్తూ 150 పడగల ఆసుపత్రి ని ప్రసాద్ ఆసుపత్రి యాజమాన్యం ఏర్పాటు చేసిందని… ప్రస్తుతం నాచారం తదితర ప్రాంతాల్లో కూడా వారి సేవలు అందుతున్నాయని తెలిపారు ప్రభుత్వం ప్రజలకు మంచి చేసే ఏ కార్యక్రమానికైనా అండగా ఉంటుందన్నారు.

గత ప్రభుత్వం నగరం చుట్టుపక్కల నాలుగు మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణం చేయబోతున్నట్లు ప్రకటించింది అయితే నిబంధనలకు విరుద్ధంగా ఆ ప్రణాళికలు ఉండడంతో వాటిని మార్చి నిబంధనలకు అనుగుణంగా ఆసుపత్రిలో నిర్మాణం చేపడతామన్నారు.గాంధీ ఆసుపత్రిలో పేరున్న నాయకులు వైద్యం తీసుకున్నారు.. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎలా ఉండబోతుంది అన్న పాత్రికెయుల ప్రశ్న కు ఆయన స్పందితూ ప్రభుత్వాసుపత్రిలో కూడా మేము వైద్యం తీసుకుంటాము .మా నాన్న ఎమ్మెల్యే గా ఉండి గాంధీ ఆసుపత్రిలో వైద్యం తీసుకున్నారు. నేను తీసుకుంటాను అని ఆయన సమాధానం ఇచ్చారు..ఈ కార్యక్రమం లో చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు రంజిత్ రెడ్డి, స్థానిక శాసనసభ్యులు అరెకపూడి గాంధీ ,మాధవరం కృష్ణారావు,ఎమ్మెల్సీ నవీన్ రావు, పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking