ఉచిత విద్యుత్ పథకాన్ని సద్వినియోగపరచుకోండి

ఉచిత విద్యుత్ పథకాన్ని సద్వినియోగపరచుకోండి

మందుల శివకుమార్

కూకట్ పల్లి, అక్షిత ప్రతినిధి:
ప్రభుత్వం ప్రజల కోసం అందజేస్తున్న పథకాలను స్వదియోగపరచుకొని లబ్ధి పొందాలని విద్యుత్ అధికారి ఏ.ఈ శరత్ బాబు పేర్కొన్నారు. సీనియర్ కాంగ్రెస్ నాయకులు మందుల శివకుమార్ తో కలిసి ప్రభుత్వ పథకాల్లో భాగంగా 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం కోసం ఆదివారం కూకట్ పల్లి డివిజన్ హనుమాన్ నగర్ లోని బస్తి దావకానలో ఏర్పాటు చేసిన మీటర్కు ఫోన్ నెంబర్ అనుసంధానం కార్యక్రమాన్ని ప్రారంభించారు. పెద్ద ఎత్తున బస్సు వాసులు పాల్గొని మీటర్ నెంబర్ కు ఆధార్, రేషన్ కార్డ్ నెంబర్ మొబైల్ నెంబర్ కు అనుసంధానం చేసుకున్నారు.విద్యుత్ సిబ్బందికి సహకరించి ప్రతి ఒక్కరు ఫోన్ నెంబర్ లింక్ చేసుకొని 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ పొందాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ఏ.ఈ శరత్ బాబు సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఏక్ నాథ్ దున్గే, సొపన్ రావు, మద్దెల రాము, పోశాల రాజు,వెంకటేష్ యాదవ్,మరియమ్మ, మరియు విద్యుత్ శాఖ అధికారులు, జిహెచ్ఎంసి సిబ్బంది, బస్తివాసులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking