ఆదిభట్ల మున్సిపాలిటీ అభివృద్ధి లక్ష్యంగా ఏకవాక్య తీర్మానం చేసిన 13 మంది కౌన్సిలర్లు

ఆదిభట్ల మున్సిపాలిటీ అభివృద్ధి లక్ష్యంగా ఏకవాక్య తీర్మానం చేసిన 13 మంది కౌన్సిలర్లు

***సమావేశానికి హాజరు కాకుండా కొంతమంది బెదిరిస్తున్నారు___13 మంది కౌన్సిలర్లు

***పోలీస్ శాఖ వారు భద్రత కల్పించాలని 13 మంది కౌన్సిలర్లు విజ్ఞప్తి

రంగారెడ్డి, అక్షిత ప్రతినిధి : రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గ పరిధిలోని ఆదిభట్ల మున్సిపాలిటీలో మొత్తం 15 వార్డులకు గాను 13 మంది కౌన్సిలర్లము స్వచ్ఛందంగా ఏకవాక్య తీర్మానంతో ఆదిభట్ల మున్సిపాలిటీ అభివృద్ధి లక్ష్యంగా ఆదిభట్ల మున్సిపాలిటీకి చెందిన చైర్పర్సన్ ,వైస్ చైర్మన్ లపై అవిశ్వాస తీర్మానాన్ని కోరుతూ కిందటి నెలలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కి దరఖాస్తు చేసుకున్నాము, స్పందించిన అధికారులు ఇట్టి విషయంపై అనగా 09.02.2024 శుక్రవారం రోజున ఉదయం 10: 00 గంటలకు అవిశ్వాస తీర్మానానికి సమావేశం ఏర్పాటు చేశారు,ఈ సమావేశానికి వెళ్ళనీయకుండా కౌన్సిలర్లను కొంతమంది బెదిరింపులకు గురిచేస్తూ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు, కావున పోలీస్ శాఖ వారు మాకు తగిన భద్రత కల్పించి సమావేశానికి చేరుకునే విధంగా సహకరించగలరని మా యొక్క విజ్ఞప్తి చేశారు ఆదిభట్ల మున్సిపాలిటీ పాలకవర్గం 13 మంది సభ్యులు.

Leave A Reply

Your email address will not be published.

Breaking