ఉచిత వైద్య శిబిరాలను ప్రజల సద్వినియోగం చేసుకోవాలి

ఉచిత వైద్య శిబిరాలను ప్రజల సద్వినియోగం చేసుకోవాలి

పందిరి ఫౌండేషన్ చైర్మన్ పందిరి నాగిరెడ్డి

కోదాడ, అక్షిత ప్రతినిధి :

పందిరి ఫౌండేషన్ ఆధ్వర్యములో కళ్యాణి డెంటల్ క్లినిక్ కోదాడ, శరత్ మ్యాక్సీ విజన్ వారి సౌజన్యముతో సోమవారం స్థానిక హుజుర్ నగర్ రోడ్ నందు ఏర్పాటు చేశారు ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ సుబ్బారావు రామారావు పాల్గొని ప్రారంభించారు ఉచిత మెగా కంటి దంత వైద్య శిభిరముకు ప్రజల నుండి అనూహ్య స్పందన లభించిందని. సుమారు 400 వందలమందికి పైగా ప్రజలు పాల్గొని పరీక్షించుకోవటం జరిగింది నిర్వాహకులు తెలిపారు క్యాంపులో పాల్గొన్న వారందరికీ ఉచితంగా పరీక్షలు, స్కానింగ్ లు నిర్వహించి, మందులు అందజేయడం జరిగింది అన్నారుఈ సందర్భంగా ఫౌండేషన్ చైర్మన్ నాగిరెడ్డి మాట్లాడుతూ కోదాడ పట్టణ నియోజకవర్గస్థాయిలో ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు హెల్త్ క్యాంపులు నిర్వహిస్తామని వారు తెలిపారు ఇలాంటి ఫ్రీ క్యాంపులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు ముఖ్య అతిథులు ఫౌండేషన్ చేస్తున్న సేవలను కొనియాడారు. వైద్యం ఖరీదైన ఈరోజుల్లో ఉచిత వైద్యశిబిరాలకు సహకరిస్తున్న డాక్టర్ కళ్యాణి అంబరీష్, డాక్టర్ శరత్ కుమార్లనుఅభినందించారుఈ కార్యక్రమంలో పందిరి ఫౌండేషన్ సెక్రటరీ ఇమ్మడి సతీష్ బాబు, గౌరవ సలహాదారులు సేకు శ్రీనివాసరావు, కోదాడ నియోజకవర్గ సీనియర్ కాంగ్రేస్ నాయకులు టీపీసీసీ డెలిగేట్ చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వంగవేటి రామారావు,, మునిసిపల్ వైస్ చైర్మన్ కందుల కోటేశ్వరరావు, కొండల్ రెడ్డి, మేకల వెంకటరావు, పైడిమర్రి రమేష్, వంగవేటి అంబరీష్, వెంపటి ప్రసాద్, వెంపటి రంజిత్ కుమార్, హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking