పల్లెల్లో గంజాయి చాక్లెట్లు

పల్లెల్లో గంజాయి చాక్లెట్లు

పోలీసులకు చిక్కిన
గంజాయి ముఠా !

మాడ్గులపల్లి, అక్షిత ప్రతినిధి :

గంజాయి చాక్లెట్లు పల్లెలకు పాకాయి. విద్యార్థులు, యువత గంజాయికి అలవాటు పడి జీవితాలు ఛిద్రం చేసుకుంటుoడ్రు.గంజాయిని సిగరెట్టు రూపంలో పొగను పీల్చి మత్తు కు అలవాటు పడిన యువత రూపం మార్చుకుని చాక్లెట్ రూపంలోకి మారి పోయింది. మత్తు సరదాగా అలవాటై ఆ తదువరి వ్యసనంగా మారుతుంది.అందమైన భవిష్యత్ అంధకారంలోకి నెట్టబడుతుంది. నగరాలు… పట్నాలకు పరిమితమైన గంజాయి… పల్లెలకు తాకింది. గుట్టుచప్పుడుగా గుట్టుక్కున మింగేలా చాక్లెట్ల రూపంలో వల్లెల్లోనూ విక్రయాలు ఊపందుకున్నాయి. యువత, విద్యార్థులను టార్గెట్ గా ఎంచుకుని గంజాయిని విక్రయించే ముఠాల స్థావరాలు పల్లెలకు విస్తరిస్తున్నాయి. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా గంజాయిని అరికట్టేందుకు నడుoబిగించినప్పటికి విక్రయదారులు అంతే స్పీడ్…ప్రతిష్టాత్మకంగా విక్రయాలకు అదే జోరుతో ఊవ్విలూరుతుండ్రు.
ఎంతవరకు వీలుచిక్కితే… అంత స్థాయిలో విక్రయించేందుకు ముఠాలు రంగంలోకి దిగాయి. పట్నాల నుంచి పల్లెలకు గంజాయిని సరఫరా చేస్తూ పాస్ట్ పుడ్ సెంటర్స్, పాన్ షాప్, కిరాణ దుకాణాల్లోనూ విక్రయిం చే పనిలో నిమగ్నమయ్యారు. తాజాగా కొలువు దీరిన కాంగ్రెస్ ప్రభుత్వం …సీఎంగా రేవంత్ రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే గంజాయి సరఫరాకు అడ్డుకట్ట వేసేందుకు అధికారులకు అదేశాలు జారీచేశారు. అధికారులంతా గంజాయి విక్రయాలు, సరఫరా తదితర వాటిపై కొరడా ఝులిపిస్తున్నప్పటికి మారుమూల పల్లెల్లోనూ గంజాయి విక్రయాలు ఊపందుకుంటున్నాయి.
గంజాయిని వివిధ రూపాల్లో సిద్దం చేసి విక్రయిస్తుండ్రు.విద్యార్థులు, యువతను టార్గెట్ గా ఎంచుకుని వారికి అనువైన స్థావరాలు, పాఠశాలలు, కళాశాలలకు అందుబాటులో విక్రయ కేంద్రాలు ఉండేలా అనువైన ప్రాంతాలను ఎన్నుకుంటుండ్రు. మిర్యాలగూడ నియోజకవర్గ పరిధిలోని వేములపల్లి, మాడ్గులపల్లి మండల కేంద్రాల్లోనూ గంజాయి జాడలు కనిపిస్తున్నాయి. మాడ్గులపల్లి మండలకేంద్రoలోని ఓ పాస్ట్ ఫుడ్ సెంటర్లో చాక్లెట్ల రూపంలో ఉన్న గంజాయిని విక్రయిస్తున్నారు. ఆనోట. ఈ నోట నుంచి పోలీసుల వరకు వెళ్లింది.సమాచారమందుకున్న మాడుగులపల్లి పోలీస్ లు పాస్ట్ ఫుడ్ సెంటర్ పై దాడులు జరిపి చాక్లెట్ల రూపంలో ఉన్న గంజాయి పొట్లాలు, ఐక్రయదారుడిని అదుపులోకి తీసుకున్నారు. తీగలాగితే డొంక కదులుతుందన్న తరహాలో ఇంకనూ విచారణ సాగుతుంది. చాక్లెట్ల రూపంలో ఉన్న గంజాయి పొట్లాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి ? ఎంత కాలం నుంచి విక్రయిస్తున్నారు? సరఫరా చేసేదేవరు? తదితర వివరాలపై ఆరా తీస్తుండ్రు.

పాస్ట్ ఫుడ్ సెంటర్ ఓ ఉద్యోగిది

మాడుగులపల్లి మండలకేంద్రంలోని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ కేంద్రంలోని ఓ ఉద్యోగికి చెందిన పాస్ట్ ఫుడ్ సెంటర్ లో గంజాయి విక్రయాలు సాగుతున్నాయి. గత కొంత కాలం క్రితమే ఓ బినామీ పేరిట ముద్రలోను సదుపాయం కల్పించి పాస్ట్ ఫుడ్ సెంటర్ ను ప్రారంభించారు. నాటి నుంచి పాస్ట్ ఫుడ్ సెంటర్లో జోరుగా గంజాయి విక్రయాలు సాగిస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. యువత భవిష్యత్ ను వరరిక్షించాల్సిన ఉద్యోగి యువత బతుకులను చిద్రం చేసే మత్తుకు బానిసలుగా చేసే పనికి ఒడిగట్టిండ్రు. పోలీస్ ల విచారణలో ఉన్న చాక్లెట్ గంజాయి ఎంత? ఎంత కాలంగా విక్రయుస్తున్నారు? తదితర వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.

Leave A Reply

Your email address will not be published.

Breaking