విద్యావ్యవస్థను భ్రష్టు పట్టించిన బిఆర్ఎస్

*తెలంగాణాలో విద్యావ్యవస్థను బిఆర్ఎస్ భ్రష్టు పట్టించింది..*
– ప్రాజెక్ట్ పేరుతో బిఆర్ఎస్ లక్షల కోట్లు ప్రజాధనం దుర్వినియోగం..

– పేదవాడి చదవుపై నయా పైసా ఖర్చుచేయలేదు..

– ఆరు గ్యారంటీలు అమలు చేసి ప్రతి పేదవాడికి సంక్షేమాన్ని అందిస్తాం..

– వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖమంత్రి దామోదర రాజనర్సింహా

– టేక్మాల్ మండలంలో అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపనలు

అందోలు, అక్షిత ప్రతినిధి :

తొమ్మిదిన్నరేళ్ల బిఆర్ఎస్ పాలన కాలంలో రాష్ట్రంలో విద్యావ్యవస్థను నిర్లక్ష్యం చేసి భ్రష్టుపట్టించిందని వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖమంత్రి దామోదర రాజనర్సింహా అన్నారు. ఆదివారం అందోలు నియోజకవర్గ పరిధిలోని టేక్మాల్ మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ వస్తే రాష్ట్రం అద్వానంగా, ధీనవస్థగా మారుతుందని ఊహించలేదన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో పాఠశాల నుండి యూనివర్సిటీ వరకు విద్యరంగ వ్యవస్థ ద్వంసమైందన్నారు. దీంతో రాష్ట్రంలో సుమారుగా 6 వేల పాఠశాలలు మూత పడటానికి కారణమైందన్నారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వం బంగారు తెలంగాణఘా మార్చుతామని చెప్పి ప్రాజెక్ట్లో కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారన్నారు. పేద పిల్లల చదువుపై నయాపైసా ఖర్చు చేయలేదని ద్వజమెత్తారు. ఇచ్చిన మాటకు కట్టుబడి సోనియాగాంధీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారన్నారు. సంపన్న రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణగా మార్చిన ఘనత బిఆర్ఎస్ఈనన్నారు. బిఆర్ఎస్ మాయ మాటలు, మోసాలను గుర్తించి విసిగిపోయిన ప్రజలు కాంగ్రేస్కు అధికారం ఇచ్చారని గుర్తుచేశారు.

*-ప్రతి హామీని నెరవేరుస్తాం..*

అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రేస్ ఆరు గ్యారంటీలను కచ్చితంగా అమలు చేసి తీరుతుందని మంత్రి దామోదర్ అన్నారు. కాంగ్రేస్ ప్రభుత్వం ఏర్పడిన రెండు రోజుల్లోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీ రూ.10 లక్షలకు పెంపు అనే రెండు గ్యారంటీలను అమలు చేశామన్నారు. మరో రెండు గ్యారంటీలు రూ.500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యూత్ పథకాలను త్వరలోనే అందిస్తామన్నారు. కాంగ్రేస్ పార్టీ మాటిచ్చి నిలబెట్టుకుంటుందన్నారు. అట్టడుగు వర్గాల ప్రజలందరికి సంక్షేమ పథకాలు అందిస్తామన్నారు. అభయహస్తం ప్రజాపాలన పేరుతో గ్రామ సభలను నిర్వహించి ప్రజల నుండి ధరఖాస్తులను స్వీకరించిందన్నారు.వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాంలో రైతులకు ఉచిత కంరెంట్ ఇచ్చిన ఘనత కాంగ్రేల్దేనన్నారు. ఏకకాలలో పంట రుణమాఫీ చేసింది కాంగ్రేసేనని, ఎన్నికల్లో ఇచ్చిన హమీ రూ.2లక్షల రుణమాఫీ కూడా నెరవేరుస్తామన్నారు.

*-అందోలు ప్రజలకు రుణపడి ఉంటా..*

ఎన్నికల సమయంలో అందోలు నియోజకవర్గ ప్రజలకు ఇచ్చన ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తానన్నారు. అందోలు ప్రాంత అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తానన్నారు. మా కుటుంబానికి 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిపిoచి సేవచేసేందుకు అవకాశం ఇచ్చారని గుర్తు చేశారు. మీ అందరి సహాకారం, ఆదరణ ఎల్లప్పుడూ ఉండాలన్నారు. రాబోవు కాలంలో మీ అందరి ఆశీర్వాదంతో మన ప్రాంతాన్ని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందామన్నారు. అందోలు ప్రాంతానికి 150 పడకల ఆసుపత్రితో పాటు, నర్సింగ్ కళాశాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పేదలకు వైద్యం చేరువచేసేందుకు పిహెచ్సీలను ఏర్పాటుచేస్తున్నామన్నారు.

*-సమస్యలు తెలుసుకుంటూ పరిష్కారానికి మంత్రి హామీ..*
టేక్మాల్ మండలంలో పర్యటించిన మంత్రి మోడలా పాఠశాలను, కేజిబీవి, ఆశ్రమ పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి విద్యార్థినిలతో మాట్లాడుతూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మహిళ టీచర్లు పదేళ్లుగా పాఠశాలల్లో సమస్యలు ఎవరు పట్టించుకోలేదని, అనేక సార్లు గత పాలకుల వద్దకు వెళ్లి వినతి పత్రాలను అందజేసిన ఫలితం లేకుండా పోయిందని తన దృష్టికి తీసుకువచ్చారని మంత్రి తెలియజేస్తూ మోడల్స్కూలుకు,కస్తూర్భాగాంధీ పాఠశాలలకు వేరువేరుగా రూ.1.50కోట్ల నిధులను అదనంగా మంజూరు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు.

*-అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపనలు*

టేక్మాల్ మండలంలో మోడల్ స్కూలు పాఠశాలలోని రూ.50 లక్షలతో పెయింటింగ్, ఎలక్ట్రిషన్, వాటర్ సప్లై వంటి పనులకు, రూ.70 లక్షలతో కేజీబీవి పాఠశాల మరమ్మత్తు పనులకు ఎల్లుపేట నుండి శాబాద్దందానికుంట వరకు రూ.1.16 కోట్లతో బీటి రోడ్డు నిర్మాణ పనులకు, రూ.2.27కోట్లు పిడబ్ల్యూడి రోడ్డు నుండి చంద్రు తండావరకు బీటి రోడ్డు నిర్మాణం, 2.45 కోట్ల నిధులతో ఎల్లుపేట గ్రామంలో పిహెచ్సీ నిర్మాణానికి . రూ.2కోట్లతో ఆయా గ్రామాల్లో సీసీ రోడ్డు నిర్మాణం, 1.67 కోట్లతో తంపూర్ పిడబ్ల్యూడి రోడ్డు నుండి నీలబోయినతండా వరకు బీటి రోడ్డు నిర్మాణం వంటి అభివృద్ధి శంకుస్థాపనలు చేశారు. కార్యక్రమంలో, మెదక్ ఆర్డీఓ అంబదాస్, పార్టీ మండల అధ్యక్షుడు నిమ్మ రమేశ్, జెడ్పిటీసీ సర్వని సరోజని మల్లేశం. వైస్ ఎంపీపీ మంజుల, యువజన కాంగ్రేస్ అద్యక్షుడు సంగమేశ్వర్, చల్లపల్లి యాదయ్య తో పాటు అధికారులు, పార్టీనాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking