ఇంటిపన్ను వసూలుకు ఐదు బృందాలు
*మునిసిపల్ కమీషనర్ యూసుఫ్
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
మిర్యాలగూడ మునిసిపల్ పరిధిలో ఇంటిపన్ను వసూళ్ల కోసం ప్రత్యేకంగా ఐదు బృందాలను ఏర్పాటు చేసినట్టు స్థానిక మునిసిపల్ కమీషనర్ ఎండి. యూసుఫ్ తెలిపారు. శనివారం విలేకరులతో మాట్లాడుతూ మునిసిపల్ పరిధిలో ప్రభుత్వ, ప్రైవేట్, వ్యాపార భవనాలపై ఉన్న ప్రస్తుత, గత బకాయిలు కలిపి మొత్తం నేటి వరకు రూ25.49కోట్ల రూపాయలు కాగా రూ5.50కోట్లు వసూలు చేశామని బకాయి రూ.19.98కోట్ల రూపాయలు ఉన్నాయని ఆయన తెలిపారు. గృహేతర, గృహాల, మీశ్రమ భవనాల పన్నులు 22.05 కోట్ల రూపాయలు ఉండగా ఇప్పటివరకు రూ.5.24కోట్ల రూపాయలు వసూలు చేశామని ఆయన అన్నారు.
అదేవిధంగా కెంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ రంగ సంస్థలు 68.02లక్షలు బకాయి ఉండగా రూ 30.76లక్షలు చెల్లించారని, అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు రూ.27.08లక్షలు బకాయిలో 1.89లక్షలు చెల్లించారని తెలిపారు. ఎన్ఎస్పీ క్యాంపు క్వార్టర్స్, ఈఈ, ఎస్ఈ కార్యాలయాలు రూ.40,57,673లు, హనుమాన్ పేట్లో దుకాణ సముదాయం రూ89,31,303లు, మిర్యాలగూడ ఫంక్షన్ హల్ రూ.9,76,164లు భారీ బకాయిలున్నారని చెల్లించాలని డిమాండ్ నోటీసు పంపామని, చెల్లించకుంటే చట్టపర చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. ఆయన వెంట రెవెన్యూ ఆఫీసర్ కళ్యాణి ఉన్నారు.