* జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోండి

* జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోండి

– కాంగ్రెస్ జిల్లా నాయకులు కునూరు సాయికుమార్ గౌడ్

నకిరేకల్ అక్షిత ప్రతినిధి

నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు నకిరేకల్ పట్టణంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో ఆదివారం జాబ్‌మేళాను నిర్వహిస్తున్నామని, మేళాను అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలని కాంగ్రెస్ జిల్లా నాయకులు కునూరు సాయికుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. ఈ జాబ్‌మేళా ద్వారా సుమారు 10 వేల మంది నిరుద్యోగులకు వివిధ పరిశ్రమల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. నియోజకవర్గ పరిధిలో విద్యావంతులైన నిరుద్యోగులు వేలాది మంది ఉన్నారన్నారు. ఉద్యోగ అవకాశాలు లేకపోవడం వల్ల తీవ్ర నిరాశ చెందుతున్న విషయాన్ని గమనించి నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ద్వారా 10వ తరగతి పూర్తిన చేసిన వారితో పాటు బీఈ, బీటెక్‌, ఎంబీఏ, ఎంసీఏ, బీఫార్మసీ, ఐటీఐ, పీజీ ఫ్రెషర్స్‌కు 60 కంపెనీలతో పాటు ప్రసిద్ధిగాంచిన ఫార్మా కంపెనీల్లో ఉద్యోగావకాశాలు కల్పిస్తామన్నారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశామన్నారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి ఏటా ఈ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు తెలిపారు

Leave A Reply

Your email address will not be published.

Breaking