కాసులిస్తేనే ఫైల్ కదిలేది
ప్రతి ఫైల్ కు రేట్
ఈ సీట్లోకి డబ్బులిచ్చే వచ్చా !
సంపాదించుకోవాలి కదా !!
ఎలక్షన్… కలెక్షన్
విజిలెన్స్ ఆరా !!!
హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :
ఎటువంటి ఫైల్ కదలాలన్నా…. కాసులివ్వాల్సిందే. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఫైల్ కు రేట్ ఫిక్సట. కాసులు చెల్లించ నిది… ఫైల్ ఎటువంటి పరిస్థితుల్లోనూ కదలదు. ఈ సీట్లోకి డబ్బులిచ్చే… వచ్చా… అది కూడబెట్టాలి కదా…. అంటూ ఎలక్షన్… కలెక్షన్ ను తలపించేలా ఎన్నికల కమీషన్ అధికారులు తీరిది. ఉన్న విధులకు అధనంగా ఎన్నికల విధులు నిర్వర్తించే అధికారులకు డబుల్ జీతాన్ని పొందే వీలుంది. అదే అదునుగా భావించిన అధికారులు అమ్యామ్యాలు దండుకుంటుండ్రు.వడ్డించేవా డు మనోడైతే… కడబంతిల ఉన్నా మనకు అందాల్సింది అందుతుంది. ప్రతి ఫైల్ కు రేట్ ఫిక్స్ చేసుకుని తిలాపాపం తలాపిడికెడు అన్న చందంగా ఎన్నికల కమీషన్ అధికారులు కాసులను దండుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఈ తంతంగం ఆనోటా… ఈ నోటా నుంచి… ఏకంగా ఫిర్యాదులు సీఎంవోకు చేరడంతో ఎన్నికల కమీషన్ లో జరిగిన అవినీతి చిట్టాపై విచారించేందుకు విజిలెన్స్ అధికారులు ఆరా తీస్తుండ్రు. ఎన్నికలను సమర్థవంతంగా, సజావుగా రీపోలింగ్ కు తావివ్వకుండా ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగించిన చీఫ్ ఎన్నికల అధికారిగా వికాస్ రాజ్ కు కీర్తితెచ్చినప్పటికి కింది స్థాయి సిబ్బంది అనుసరించిన విధానాలతో ఎన్నికల కమీషన్ కు మాయనిమచ్చ అంటుకుంది.
ఎన్నికలను సజావుగా చేపట్టేందుకు ఎన్నికల కమీషన్ స్వతంత్ర ప్రతిపత్తి కల్గి ప్రత్యేక అధికారాలను కూడకట్టుకుంటుంది. లోక్ సభ,అసెంబ్లీ, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు చేసిన ఖర్చుకు కూడా ఆడిటింగ్, క్రాస్ చెక్ కూడా ఉండదు. ఎన్నికల ప్రక్రియను పురస్కరించుకుని ఆయా సందర్భాల్లో ఎంతటి ఖర్చుకైనా వెనుకాడకుండా ఖర్చుచేస్తుంది. ఉద్యోగుల జీతభత్యాలు, ఓటర్ల నమోదు మొదలుకొని ప్రింటింగ్, స్టేషనరీ, హోర్డింగ్, పబ్లిసిటీ, పేపర్, టివి యాడ్స్ తదితర వాటన్నింటికి కూడా ఎన్నికల కమీషన్ ఖర్చు చేస్తుంది. ఎన్నికలు సజావుగా సాగేందుకు అవసరమైన ప్రత్యేక పరిస్థితుల్లో ఎంతటి ఖర్చునైనా చేస్తుంది.
ఎన్నికల కమీషన్ లో సహజంగానే పూర్తిస్థాయి ఉద్యోగుల సంఖ్య తక్కువ. ఆయా ఎన్నికల ప్రక్రియను పురస్కరించుకుని ఎన్నికల విధులను నిర్వర్తించేందుకు సెక్రటేరియేట్, రెవిన్యూ, జీఏడి తదితర శాఖల నుంచి డిప్యూటేషన్ ప్రాతిపదికన ఉద్యోగులు, సిబ్బందిని నియమిస్తారు. ఎన్నికల విధులు నిర్వర్తించినందుకు గాను ఆయా ఉద్యోగులకు రెగ్యులర్ జీతంతో పాటు అదనంగా జీతాన్ని ఎన్నికల కమీషన్ చెల్లిస్తుంది. ఇదే అదునుగా భావించిన ఎన్నికల కమీషన్ లో డ్రాయింగ్ ఆఫీసర్ చక్రం తిప్పారు. 2023 నవంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలను పురస్కరించుకుని విధులు నిర్వర్తించకుండానే సుమారు 20 నుంచి 30 మందికి పైగానే డబ్బులు చెల్లించారట. పనిచేయకున్నా పర్వాలేదు… ఆయా అధికారుల పేర్లు ఇస్తే చాలు…వారికి డబ్బులిచ్చేశారు… ఎన్నికల విధుల్లో ఎంతమంది వనిచేశారు ? ఎంతకాలం పనిచేశారు? తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని ఆయా వివరాలకు అనుగుణంగా ఇసీ డ్రాయింగ్ ఆఫీసర్ నిర్ధారించుకుని ఆర్థిక శాఖకు నివేదిస్తారు. ఇక ఆయా అధికారుల జీతాల అకౌంట్లలోకి డబ్బు వచ్చి చేరుతుంది. విధులు చేపట్టకుండానే వచ్చిన జీత భత్యాల్లో నీకింత నాకింత అన్న చందంగా జీఏడి అధికారితో పాటు ఇసీలో డ్రాయింగ్ ఆపీసర్లు కలిసి అక్రమ కాసుల దందాను పక్కాగా చేపట్టి సఫలీకృతులయ్యారు. ఈ తంతగమంతా ఆనోటా ఈ నోటా నుంచి ఏకంగా సీఎంఓకు ఫిర్యాదుల రూపంలో వెల్లువెత్తాయి. తీగలాగితే డొంక కదిలిన చందంగా జీతభత్యాలకు తోడు అన్నింటా అవినీతి రాజ్యమేలుతుందన్న నివ్వెరపోయే వాస్తవాలు వెలుగు చూశాయి. స్టేషనరీ, పబ్లిసిటీ, పేపర్, టీవి యాడ్స్, హోర్డింగ్ తదితర వాటిల్లోనూ అదనపు బిల్లులను జోడించినట్లు కాజేసినట్లు సమాచారం. ఆయా బిల్లుల స్థాయిని బట్టి ముట్టజెప్పకపోతే బిల్లుల విడుదల ఊసే ఉండదు. అది నెలల తరబడి తచ్చాడుతూ వేచి ఉండాల్సిందే. చిన్న చిన్న బిల్లులు కూడా విడుదల చేయడంలో అలక్ష్యం వహిస్తూ నాలుగు నెలల నుంచి తచ్చాడుతున్న పరిస్థితి. కాసులిస్తే… ఫైల్ వెంటనే పరుగులు పెడుతుంది. లేకుంటే బడ్జెట్ లేదన్న సాకుతో కాలయాపన చేస్తూ… ఇక చేసేదేమిలేక కాసులిచ్చి బిల్లులను విడుదల చేయించుకుంటున్నట్లు సమాచారం. ఈ సీట్లోకి నేను ఊరికే రాలే… లంచమిచ్చే ఈ సీట్లోకి వచ్చా… అదంతా సంపాదించుకోవాలి కదా… ఎలక్షన్ అంటే కలెక్షన్ ను తలపించేలా బహిరంగగానే ఇసీ అధికారులు చేస్తున్న వ్యాఖ్యలు అక్రమార్జనకు ఎంతకు బరితెగించారన్న విషయం తేట తెల్లమవుతుంది. వివిధ పనుల నిమిత్తం ఎన్నికల కార్యాలయానికి వెళ్లిన పత్రి ఒక్కరికి అక్కడి అధికారుల వింత వివర్తన వి…