సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలు
ఖమ్మం/అక్షిత బ్యూరో :
ఖమ్మం నగరం పాండురంగాపురం నందు సేవాలాల్ మహారాజ్ ఆలయ కమిటీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బాల్ సింగ్ మంగ్యనాయక్ ఆధ్వర్యంలో సేవాలాల్ జయంతి కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టిఎస్ టిటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు బాణోత్ వీరు నాయక్ పాల్గొని సేవాలాల్ మహారాజ్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లి చైతన్య పరిచి ఒక మంచి సమాజాన్ని నిర్మించాలని బంజారా ప్రజలు నీతి నిజాయితీతో జీవించాలని వారు కోరారు.సేవాలాల్ మహారాజ్ ఆశయాలైన ప్రకృతిని కాపాడాలని జంతువుల పట్ల దయతో ఉండాలని మంచి విద్యను అభ్యసించి అభివృద్ధి బాటలో నడవాలని వారు కోరారు.

అనంతరం అన్నధానం కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో సేవాలాల్ సేన రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ టీఈజిఎ ఖమ్మం జిల్లా అధ్యక్షులు బాదావత శ్రీను నాయక్ ఆలయ కమిటీ నాయకులు మంగీలాల్ జాదవ్ చక్రవర్తి నాగు నాయక్ మతృనాయక్ రమేష్ పాపా లాల్ కిషన్ రాథోడ్ దేవ సింగ్ రాము బాలాజీ హథిరాం బన్సీలాల్ బాబురావు లక్ పతి తదితురులు పాల్గొన్నారు.