నోరు జారితే నాలుక కోస్తాం
టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి దేవులపల్లి యాదగిరి
నంగునుర్, అక్షిత ప్రతినిధి:
నిన్న ప్రజాహితయాత్రలో రవాణా మరియు బీసీ సంక్షేమమంత్రి పొన్నం ప్రభాకర్ పై బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలు చేసినందుకుగాను నిరసనగా మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో నంగునూర్ మండల కేంద్రం లో బండి సంజయ్ దిష్టి బొమ్మ ప్లెక్సీ దహనం చేశారు.ఈ సందర్భంగా ముఖ్య అతిధిగా పాల్గొన్న టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి దేవులపల్లి యాదగిరి మాట్లాడుతు కేంద్ర ప్రభుత్వం ఎంపీ ఐన బండి సంజయ్ ఒక్కసారి కూడ ప్రజల అభివృద్ధి కోసం కానీ ప్రజల సమస్యలు కానీ పట్టని చేతకాని దద్దమ్మ అనునిత్యం ప్రజల కోసం హుస్నాబాద్ ప్రాంత అభివృద్ధి కోసం పనిచేస్తున్న మంత్రి పొన్నం ప్రభాకర్ పైన వారి కుటుంబ సభ్యుల పైన చేసిన అనుచిత వాఖ్యలను మేము తీవ్రంగా కండిస్తునం అన్నారు. పొన్నం ప్రభాకర్ మంత్రి గా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుండి కరీంనగర్ జిల్లా లో మంత్రి కి వస్తున్నా ఆదరణ చూసి బండి సంజయ్ ఆటలు సాగవని ఓటమి భయం తోనే సంజయ్ మూర్ఖంగా మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వం బండి సంజయ్ కరీంనగర్ జిల్లా కు మంచి చేసిఉంటే అంత ఎందుకు భయపడుతున్నాడో సమాధానం చెప్పాలని నిలదీశారు.పొన్నం పైన వారి తల్లి పైన పిచ్చికుతాలు కూసిన బండి సంజయ్ తక్షణమే క్షేమపణ చెప్పాలని డిమాండ్ చేశారు.మరోసారి ఇలాంటి వాక్యాలు చేస్తే అరగుండు కొట్టించి గాడిద మీద ఊరేగిస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమం లో మండలం పార్టి అధ్యక్షులు తప్పేట శంకర్, అచ్చిన సత్తయ్య, గాండ్ల రమేష్, గోనెపల్లి శివప్రసాద్, జంగిటి శ్రీనివాస్,దాసరి కిషన్,రాగుల కనకయ్య. అనరాజు రాజు,జాప ఘనపరం రమేష్,అనుముల జైపాల్ రెడ్డి, భోజు రమేష్, చిలిలుక శేఖర్ రెడ్డి,దేవులపల్లి శంకర్,లు పాల్గొన్నారు.